ప్రయాణికుల రద్దీ - శుభవార్త చెప్పిన రైల్వే శాఖ - నేడు రేపు స్పెషల్ ట్రైన్స్

ఠాగూర్
ఆదివారం, 17 ఆగస్టు 2025 (09:54 IST)
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య రెండు రోజుల పాటు ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ రెండు నగరాల మధ్య ప్రత్యేక రైళ్ళను నడుపనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం, సోమవారాల్లో ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. 
 
ఆదివారం తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు (07097) బయలుదేరుతుంది. అలాగే, రేపు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మరో ప్రత్యేక రైలు (07098) అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఒక ప్రటనలో తెలిపారు. 
 
ఈ ప్రత్యేక రైళ్లు మార్గమధ్యంలో రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, కృష్ణ, యాద్గిర్, తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట్ స్టేషన్లలో ఆగుతాయని అధికారులు వివరించారు. ఈ మార్గంలో ప్రయాణించే వారు ఈ సౌకర్యాని వినియోగించుకోవాలని రైల్వే శాఖ సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments