Webdunia - Bharat's app for daily news and videos

Install App

2024లో కుప్పంలో చంద్ర‌బాబును ఓడించాలి...స‌జ్జ‌ల‌

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (13:14 IST)
2024లో కుప్పం నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ ఏ ఘన విజయం సాధించేలా పనిచేయాలని ఆ పార్టీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ నేత దివంగత చంద్రమౌళి తనయుడు భరత్ జెయింట్ కిల్లర్ గా అసెంబ్లీలో అడుగుపెట్టాలని అన్నారు. చంద్రబాబుకు సర్పంచ్ ఎన్నికల నుంచే కుప్పంలో కౌంట్ డౌన్ ప్రారంభమైందని అన్నారు.

తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వ‌న్య‌కుల క్ష‌త్రియ‌ కమ్యూనిటీ రాష్ట్ర స్థాయి సమావేశానికి వ‌న్య‌కుల క్ష‌త్రియ‌ ఛైర్‌పర్సన్‌ శ్రీమతి కె.వ‌నిత శ్రీ‌ను అధ్యక్షత వహించారు. సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. కుప్పం టిడిపి కోటను బ్రధ్దలు కొట్టుకుని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎంతగా ప్రజల హృదయాలలో చొచ్చుకుని పోయారనేందుకు, సర్పంచ్ ఎన్నికలలో విజయమే తార్కాణంగా నిలుస్తుందని సజ్జల అన్నారు. సర్పంచ్ ఎన్నికల విజయాలను యువనేత భరత్ కొనసాగించాలని కోరారు.
 
రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ మాట్లాడుతూ, వన్యకుల క్షత్రియ కులస్ధులు మాట తప్పని వ్యక్తులని, వారంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో అత్యధికమంది వన్యకుల క్షత్రియులు ఉన్నారని వారికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని అన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి  మాట్లాడుతూ,  బిసి కులాల అభ్యున్నతే లక్ష్యంగా గత కొద్ది రోజులుగా బిసి కులాల ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని తెలియచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments