Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలితో సంబంధం పెట్టుకున్నాడనీ బర్రెల కొట్టం వద్దకు పిలిచి హత్య చేశాడు...

తనతో సంబంధం పెట్టుకున్న యువతితో మరో వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని ఆ వ్యక్తి జీర్ణించుకోలేక పోయాడు. దీంతో బర్రెల కొట్టం వద్దకు పిలిచి ఇనుప రాడ్‌తో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. ఈ కేసును పోలీ

Webdunia
గురువారం, 23 మార్చి 2017 (09:14 IST)
తనతో సంబంధం పెట్టుకున్న యువతితో మరో వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని ఆ వ్యక్తి జీర్ణించుకోలేక పోయాడు. దీంతో బర్రెల కొట్టం వద్దకు పిలిచి ఇనుప రాడ్‌తో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. ఈ కేసును పోలీసులు కాల్ డేటా ఆధారంగా ఛేదించారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్‌ దుండిగల్‌ గ్రామంలోని బర్రెల కొట్టంలో జక్కుల గోపాల్‌ యాదవ్‌ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడి సెల్‌ఫోన్‌ కాల్‌డేటా పరిశీలించిన పోలీసులు.. నిందితుడిని గుర్తించి మంగళవారం అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమని తేలింది. 
 
గోపాల్‌ యాదవ్‌ ఓ యువతితో వివాహేతర సంబంధం ఉంది. ఆమెకు గతంలో మరొక వ్యక్తి (హత్య చేసిన నిందితుడు)తో సన్నిహిత సంబంధం ఉంది. గోపాల్‌ యాదవ్‌తో ఆమె ఉండటం చూసిన ఆ వ్యక్తి జీర్ణించుకోలేకపోయాడు. మంచి పద్ధతి కాదని, ఆమెకు దూరంగా ఉండాలని గోపాల్‌ను అతడు పలుమార్లు హెచ్చరించాడు. అయినా అతడి తీరు మారలేదు. గోపాల్‌ను హతమార్చాలనుకున్నాడు. 
 
బర్రెల కొట్టం దగ్గరికి వెళ్లే సమయంలో సులువుగా ఖతం చేయవచ్చని భావించాడు. సోమవారం రాత్రి సమీపంలో మద్యం తాగాడు. పథకం ప్రకారం బర్రెల కొట్టం వద్దకు పిలిచి.. రాడ్డుతో తలపై కొట్టాడు. తీవ్రరక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతని పేరు, ఇతర వివరాలను మాత్రం బహిర్గతం చేయడం లేదు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments