Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమెను విడిచి ఉండలేనంటూ యువకుడి ఆత్మహత్యాయత్నం

పరాయి వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు.. ఆమెను విడిచి ఉండలేనంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరం మండలం రావుల చెరువు గ్రామంలో జరిగింది. ఈ వివరాలను పర

Webdunia
మంగళవారం, 12 జూన్ 2018 (12:23 IST)
పరాయి వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు.. ఆమెను విడిచి ఉండలేనంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరం మండలం రావుల చెరువు గ్రామంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఈ గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ అనే ఓ యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరూ ఊరువిడిచి పారిపోయారు. ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు వారు తిరుపతిలో ఉన్నట్టు తెలుసుకున్నారు. 
 
ఆ తర్వాత లక్ష్మీనారాయణ బంధువులు 10 రోజుల క్రితం వారి ఇరువురిని స్వగ్రామానికి తీసుకువచ్చి వీడిదీసి, ఆ మహిళను భర్త వద్దకు చేర్చారు. పైగా, ఇది సరైన పద్ధతికాదని, త్వరలో వేరే అమ్మాయిని చూసి వివాహం చేస్తామని తల్లిదండ్రులు కూడా చెప్పారు. 
 
అయితే, ఆమెను విడిచి ఉండలేని చెప్పిన ఆ యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో పడివున్న ఇరుగుపొరుగువారు లక్ష్మీనారాయణను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దీనిపై రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

మునుపెన్నడూ లేని విధంగా స్క్రీన్‌లపై కింగ్‌డమ్ విడుదల కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments