Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసు నమోదైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలా?: రేవంత్ రెడ్డి

Webdunia
ఆదివారం, 2 ఆగస్టు 2015 (14:52 IST)
ఈ దేశంలో ఎంతో మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనేక కేసులు నమోదై ఉన్నాయని, వారిలో ఏ ఒక్కరు కూడా రాజీనామా చేయలేదని అలాంటపుడు తాను మాత్రం ఎందుకు చేస్తానని తెలంగాణ టీడీపీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
 
ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అందువల్ల కొడంగల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. 
 
మన దేశంలో సుమారు 200 మందికి పైగా పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులపై వివిధ కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. వీటిల్లో అత్యధికం విచారణ దశలో ఉన్నాయని, వీరెవ్వరూ రాజీనామాలు చేయలేదని అన్నారు. వీరిలో ఏ నేతకూ వర్తించని చట్టం తనకు మాత్రం ఎందుకు వర్తిస్తుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments