Webdunia - Bharat's app for daily news and videos

Install App

వలపు వలతో మన్మథ బాణం.. ఎంజాయ్ చేశాక యూత్‌కు బ్లాక్ మెయిల్

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (10:16 IST)
ఇటీవలి కాలంలో అమ్మాలు అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. 20 యేళ్ల లోపు యువకులకు వలపు వల విసిరి వారిని ట్రాప్ చేస్తున్నారు. తమలో వలలో పడిన తర్వాత వారి డబ్బులతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ తర్వాత బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా పలువురు కిలాడీ లేడీల బాగోతం వెలుగు చూసింది. తాజాగా ఓ బాధితుడి తండ్రి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించడంతో కిలాడీ లేడీ బండారం బయట పడింది. 
 
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన మహిళకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నగరంలోని కుషాయిగూడ పరిధిలో నివాసముంటోంది. ఈజీ మనీకి అలవాటు పడిన ఆమె 17-20 ఏళ్ల యువకులను టార్గెట్‌ చేసుకుని వలపు వల విసిరి లొంగదీసుకునేది.
 
తర్వాత డబ్బులు కావాలంటూ అందినకాడికి దోచుకునేది. ఇవ్వకుంటే యువకులను కేసులు పెడతానని బెదిరించేది. పలువురు యువకులను జైలుకి కూడా పంపించిందని ఓ బాధితుడి తండ్రి ఆరోపించారు. 
 
సెక్స్‌ రాకెట్‌ నడుపుతూ తన కొడుకు వద్ద నుంచి డబ్బులు గుంజుతోందని పలుమార్లు కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధితుడి తండ్రి చెప్పారు. 
 
చివరికి న్యాయం కోసం మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించినట్లు ఆయన తెలిపారు. బాధితుడి ఆవేదన విన్న కమిషన్‌ నవంబర్‌ పదో తేదీలోపు సమగ్ర నివేదిక సమర్పించాలని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం