Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్లో తువ్వాలు కుక్కి... రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళను లాక్కెళ్లి గ్యాంగ్‌ రేప్‌

హైదరాబాద్ నగరంలో మరో మహిళ లైంగికదాడికి గురైంది. రోడ్డుపై నడిచి వెళుతున్న ఓ మహిళను బలవంతంగా లాక్కెళ్లి.. ఆమె నోట్లో తువ్వాలు కుక్కి కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం అర్థరాత్ర

Webdunia
బుధవారం, 24 మే 2017 (07:55 IST)
హైదరాబాద్ నగరంలో మరో మహిళ లైంగికదాడికి గురైంది. రోడ్డుపై నడిచి వెళుతున్న ఓ మహిళను బలవంతంగా లాక్కెళ్లి.. ఆమె నోట్లో తువ్వాలు కుక్కి కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం అర్థరాత్రి ఉప్పల్‌ పీర్జాదిగూడలో ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్, బోడుప్పల్ ప్రాంతానికి చెందిన 35 యేళ్ల మహిళ భవన నిర్మాణ రంగ కార్మికురాలిగా పనిచేస్తోంది. సోమవారం పని ముగిసిన తర్వాత రాత్రి 10.30కి ఇంటికి బయలుదేరింది. ఉప్పల్‌ ప్రధాన రహదారిపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో నల్ల చెరువు వద్ద ఇద్దరు యువకులు బైకుపై ఆమెను వెంబడించి చెరబట్టారు. 
 
పిమ్మట ఆమె కేకలు వేయకుండా నోట్లో తువ్వాలు కుక్కి... బలవంతంగా పీర్జాదిగూడ ప్రభుత్వ పాఠశాల పక్కనున్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. తమ కామవాంఛ తీర్చుకున్న తర్వాత స్థానిక ఆలయం వద్ద వదిలేసి పారిపోయారు. అటుగా వెళ్తున్న వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. 
 
కేసు నమోదు చేసిన పోలీసులు... బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఘటనాస్థలికి దగ్గరలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈమె బాధితురాలు కూలి పని కోసం 20 రోజుల కిందటే నగరానికి వచ్చింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments