Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తతో విడిపోయింది.. పుట్టింటికి వచ్చేసింది.. పెళ్లి చేసుకుంటానని వేరే వ్యక్తి రేప్ చేశాడు..

భర్తతో విడిపోయింది. పుట్టంటికి వచ్చేసింది.. దీన్ని అదనుగా తీసుకున్న ఓ వ్యక్తి ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. ఇక ఆమె కూడా అతనిని నమ్మింది. అయితే పెళ్లి పేరిట ఆ దుర్మార్గుడు

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2017 (09:15 IST)
భర్తతో విడిపోయింది. పుట్టంటికి వచ్చేసింది.. దీన్ని అదనుగా తీసుకున్న ఓ వ్యక్తి ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. ఇక ఆమె కూడా అతనిని నమ్మింది. అయితే పెళ్లి పేరిట ఆ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన యువతి (23)కి 2011లో వివాహమైంది. 
 
కుమార్తె పుట్టిన తర్వాత భర్త నుంచి దూరంగా విడిపోయింది. అప్పటి నుంచి పుట్టింట్లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు అద్దెకు ఉంటున్న యజమాని లాడ్జీతో కలిసి పెళ్లి కోసం ఓ ఫంక్షన్ హాలుకు వెళ్లింది. అక్కడ బంధువైన మహిళ ద్వారా ఇమ్రాన్‌(30) అనే వ్యక్తి పరిచయ మయ్యాడు. ఒకరికొకరు ఫోన్‌ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ పరిచయం కాస్త ప్రేమ వరకు వెళ్లింది. 
 
పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పాడు. దీంతో నమ్మిన యువతి.. ఇమ్రాన్ పిలిచాడని బిర్యానీ షా టేకిడి వద్దకు వెళ్లింది. ఈ నెల 24న బైక్‌పై తీసుకుని నవాబ్‌సాబ్‌కుంటలో ఓ మహిళ ఇంటికి తీసుకెళ్లాడు. ఆ మహిళ వారిద్దరినీ ఇంట్లో ఒంటరిగా వదిలేసి బయటకు వెళ్లిపోయింది. ఇదే అదునుగా భావించిన అతడు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Simran Singh: ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ సిమ్రాన్ సింగ్ ఆత్మహత్య.. ఉరేసుకుంది.. ఆ లెటర్ కనిపించలేదు.. (video)

తెలుగు సీరియల్ నటిని వేధించిన కన్నడ నటుడు చరిత్ అరెస్ట్

కీర్తి సురేష్ షాకింగ్ నిర్ణయం.. సినిమాలకు బైబై చెప్పేస్తుందా?

కన్నడ హీరో గణేష్‌ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం

మెగాస్టార్ చిరంజీవి ఫొటో షూట్ ఎంతపని చేసింది - క్లారిటీ ఇచ్చిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments