Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్ బాలికలతో వ్యభిచారం... ఎక్కడ?

హైదరాబాద్ నగరం ఇపుడు ఎన్నో నేరాలు ఘోరాలకు అడ్డాగా మారుతోంది. తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన మైనర్ గర్ల్స్‌తో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచారాన్ని నగర టాస్క్ ఫోర్స్ అధికారులు బహిర్గతం చేశారు.

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2017 (12:15 IST)
హైదరాబాద్ నగరం ఇపుడు ఎన్నో నేరాలు ఘోరాలకు అడ్డాగా మారుతోంది. తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన మైనర్ గర్ల్స్‌తో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచారాన్ని నగర టాస్క్ ఫోర్స్ అధికారులు బహిర్గతం చేశారు. అలాగే, వ్యభిచార కూపంలో మగ్గుతున్న ఇద్దరు మైనర్ యువతులు రక్షించి ప్రభుత్వ సంరక్షణా గృహానికి తరలించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
వెస్ట్ బెంగాల్‌ రాష్ట్రంలోని అరాంధారా తాలూకా, సిరిపురా గ్రామానికి చెందిన అబ్దుల్‌ బారిఖ్‌ షేక్‌ అలియాస్‌ రాజు(44) అనే వ్యక్తి మూడేళ్ళ క్రితం నగరానికి జీవనం కోసం వచ్చి స్థానికంగా ఉండే ఓ నిర్మాణ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇదే కంపెనీలో పని చేసే బంగ్లాదేశ్‌కు చెందిన షిరాజుల్‌ ఇస్లాం(19) అనే యువకుడితో పరిచయమేర్పడింది. 
 
వీరిద్దరు కలిసి అమ్మాయిలతో వ్యభిచారం చేసి డబ్బులు సంపాదించాలని నిర్ణయించారు. ఇందుకోసం బంగ్లాదేశ్‌ నుంచి యువతులను తీసుకువస్తానని అందుకుగాను రోజుకు రూ.15 వేలు చెల్లించాలని షిరాజుల్ ఒప్పందం చేసుకున్నాడు. ఆ తర్వాత బారిఖ్‌ షేక్‌ నాలుగు నెలల క్రితం లంగర్‌హౌస్‌, బాపునగర్‌, న్యూ మయూరి స్వీట్స్ ప్రాంతంలో నెలకు రూ.6 వేలు చెల్లించి, ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. 
 
బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు మైనర్‌ బాలికలతో ఇక్కడ వ్యభిచారాన్ని గుట్టుచప్పుడుకాకుండానే నిర్వహిస్తున్నాడు. ఈ విషయంపై స్థానికులు ఇచ్చిన సమాచారంతో నిఘా వేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు... నిందితులు అబ్దుల్‌ బారిఖ్‌ షేక్‌, షిరాజుల్‌ ఇస్తాంలను అరెస్టు చేశారు. బాలికలను సంరక్షణ కేంద్రానికి తరలించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments