Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కార్డన్‌సెర్చ్' పేరిట విస్తృత తనిఖీలు... 50 మంది అనుమానితుల అరెస్టు...!

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (12:31 IST)
హైదరాబాద్‌లోని ఉప్పల్ చిలుకానగర్‌లో పోలీసులు బుధవారం రాత్రి కార్డన్‌సెర్చ్ ఆపరేషన్‌ పేరుతో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా నాలుగు వందల మంది పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంట్లో గాలింపు చర్యలు చేపట్టారు. మల్కాజ్‌గిరి డీసీపీ రమారాజేశ్వరి నేతృత్వంలో చేపట్టిన విస్తృత తనిఖీలు బుధవారం రాత్రి నుంచి గురువారం వేకువజాము వరకు జరిపారు. 
 
ఈ తనిఖీల్లో పోలీసులు 50 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 13 మంది పాతనేరస్థులుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఎక్కువమంది ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్ వంటి ఉత్తరాధి రాష్ట్రాలకు చెందిన వారు అని పోలీసులు వెల్లడించారు. 
 
ఈ తనిఖీలలో భాగంగా పోలీసులు ఆధారాలు లేని 40 వాహనాలను, 9 గ్యాస్ సిలిండర్లతోపాటు గ్యాస్ కట్టర్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా గత ఆదివారం అమీర్‌పేట పరిధిలో పోలీసులు జరిపిన తనిఖీలలో 110  మంది అనుమానితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments