Webdunia - Bharat's app for daily news and videos

Install App

పందికొవ్వుతో వంటనూనెలు.. ఫాస్ట్ సెంటర్లలో వాడకం...

మార్కెట్‌లో దొరికే ప్రతి వస్తువూ కల్తీమయమైపోయింది. చివరకు తాగునీరు కూడా కల్తీ అవుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లోకి పందికొవ్వుతో తయారు చేసిన వంటనూనెలు ఉన్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Webdunia
గురువారం, 27 జులై 2017 (14:56 IST)
మార్కెట్‌లో దొరికే ప్రతి వస్తువూ కల్తీమయమైపోయింది. చివరకు తాగునీరు కూడా కల్తీ అవుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లోకి పందికొవ్వుతో తయారు చేసిన వంటనూనెలు ఉన్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కల్తీ నూనెను రోడ్ల పక్కన చిరుతిళ్లు తయారు చేసే బళ్లు, చైనీస్‌ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో విరివిగా వినియోగిస్తున్నట్లు సమాచారం. 
 
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో ఆరోగ్య శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 50 రకాల నకిలీ నిత్యావసర వస్తువులతో పాటూ.. వంట నూనెలలు కల్తీ జరిగినట్టు గుర్తించారు. ముఖ్యంగా గేదెలు, ఇతర జంతువులు, ముఖ్యంగా పంది కొవ్వుతో నూనె తయారు చేస్తున్న విషయాన్ని గుర్తించారు. నూనె తయారీ కోసం ఓ కాలనీలో వందల సంఖ్యలో పందులను పెంచడం గమనార్హం.
 
నేరేడ్‌మెట్‌ ప్రాంతంలోని రామకృష్ణాపురం కాలనీలో దాదాపు 200 కుటుంబాలు ఉన్నాయి. ఏళ్ల కిందట వచ్చి స్థిరపడిన తమిళులు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది పందుల పెంపకంపై దృష్టిసారించారు. కొందరు వ్యాపారులు పందులను కొనుగోలు చేసి మాంసాన్ని విక్రయిస్తున్నారు. 
 
అదేసమయంలో పందుల కొవ్వును జాగ్రత్త చేసి దాన్నుంచి నూనె తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఈ నూనెను లీటరు రూ.45కు విక్రయిస్తున్నారు. ఈ నూనె డబ్బాలో ఉన్నప్పుడు కొద్దిగా దుర్వాసన వచ్చినా.. మరగబెడితే అది పూర్తిగా పోతుందని చెబుతున్నారు. దీనికి సంబంధించి పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments