ఓ నిరుద్యోగి ఇద్దరు భామలతో రాసలీలలు కొనసాగిస్తూ పోలీసులకు చిక్కాడు. ఒక మహిళతో సహజీవనం చేస్తూనే, ఆమె స్నేహితురాలిని కూడా బుట్టలో వేసుకుని శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఇదేంటని సహజీవనం చేసే తొలి మహిళ ప్
ఓ నిరుద్యోగి ఇద్దరు భామలతో రాసలీలలు కొనసాగిస్తూ పోలీసులకు చిక్కాడు. ఒక మహిళతో సహజీవనం చేస్తూనే, ఆమె స్నేహితురాలిని కూడా బుట్టలో వేసుకుని శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఇదేంటని సహజీవనం చేసే తొలి మహిళ ప్రశ్నిస్తే.. చంపేస్తాను.. నోర్మూసుకుని కూర్చో అంటూ బెదిరించాడు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించి, కటకటాలవెనక్కి నెట్టింది.
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని శ్రీరాంనగర్‌లో ప్రేమ్‌కుమార్(26) అనే నిరుద్యోగి నివసిస్తున్నాడు. ఇతనికి అదే ప్రాంతానికి చెందిన టి.స్రవంతి (26) అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వారిమధ్య ప్రేమకు దారితీసింది. ఫలితంగా వారిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రియాచౌదరి అనే మహిళ స్రవంతి స్నేహితురాలు. దీంతో స్రవంతి ఇంటికి ప్రియా చౌదరి వస్తూపోతుండేది. ఆ సమయంలో ప్రేమ్ కుమార్ చిన్నగా మాట కలిపి.. ఆమెను కూడా బుట్టలో వేసుకున్నాడు. పైగా, ప్రియా చౌదరితో ప్రేమ్ కుమార్ సన్నిహితంగా ఉండటాన్ని స్రవంతి కళ్లారా చూసి.. ఇదేంటని నిలదీసింది. దీంతో నోర్మూసుకో... మరో మాట మాట్లాడితే చంపేస్తానంటూ బెదిరించి ఆమెపై దాడి చేశాడు. దీంతో స్రవంతి స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో ప్రేమ్ కుమార్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.