Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్నం తీసుకోవడం నేరమైతే... కట్నం ఇవ్వడం కూడా నేరమే : భార్యపై చర్యకు భర్త ఫిర్యాదు

వివాహ సమయంలో అత్తింటివారు ఇచ్చే కట్నం తీసుకోవడం నేరమైతే... తనకు కట్నం ఇవ్వడం కూడా నేరమేనని, అందువల్ల తన భార్యపై చర్య తీసుకోవాలంటూ ఓ భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఈ వివరాలను పరిశీలిస్తే....

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (10:16 IST)
వివాహ సమయంలో అత్తింటివారు ఇచ్చే కట్నం తీసుకోవడం నేరమైతే... తనకు కట్నం ఇవ్వడం కూడా నేరమేనని, అందువల్ల తన భార్యపై చర్య తీసుకోవాలంటూ ఓ భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఈ వివరాలను పరిశీలిస్తే.... 
 
గుంటూరుకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి, హైదరాబాద్‌కు చెందిన యువతిని మూడేళ్ల క్రితం ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్ల కాపురంలో కలతలు రావడంతో వేరుపడ్డారు. దీంతో పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నం ఇప్పించాలని వధువు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో సుబ్రహ్మణ్యంపై వరకట్నం కేసును పోలీసులు నమోదు చేశారు. 
 
దీంతో భార్యపై కూడా భర్త ఫిర్యాదు చేశాడు. తాను కట్నం తీసుకోవడం నేరమైతే, ఆమె కట్నం ఇవ్వడం కూడా నేరమేనని, ఆమెపై కూడా కేసు నమోదు చేయాలంటూ పోలీసులను డిమాండ్ చేశారు. దీనిని వారు పట్టించుకోకపోవడంతో ఆయన ఆర్టీఐ చట్టం కింద సికింద్రాబాద్‌ ఆర్డీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అక్కడి అధికారులు స్పందించకపోవడంతో ఆయన ఆర్టీఐ అధికారి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌‌ను సంప్రదించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments