Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసలే వివాహేతర సంబంధం.. అడిగిన పాపానికి బిడ్డను ఆటోకేసి కొట్టాడు..?

మూడేళ్ల వయస్సున్న చిన్నారి పట్ల ఓ కన్నతండ్రి కిరాతకంగా ప్రవర్తించాడు. చిన్న గాయం తగిలితేనే కందిపోయే చర్మాన్ని కలిగివుండే చిన్నారిని ఏకంగా ఆటోకేసి కొట్టాడు. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది.

Webdunia
మంగళవారం, 10 జులై 2018 (15:35 IST)
మూడేళ్ల వయస్సున్న చిన్నారి పట్ల ఓ కన్నతండ్రి కిరాతకంగా ప్రవర్తించాడు. చిన్న గాయం తగిలితేనే కందిపోయే చర్మాన్ని కలిగివుండే చిన్నారిని ఏకంగా ఆటోకేసి కొట్టాడు. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ సిటీ కూకట్ పల్లి జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉమాదేవి నగర్. అతడి పేరు శివగౌడ్. స్థానికంగా పనులు చేసుకుంటూ.. ఆటో నడుపుతూ ఉంటాడు. అతనికున్న వివాహేతర సంబంధంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య, ఆమె తరపు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
పోలీసుల వరకు వెళ్లటంతో ఆగ్రహంతో ఊగిపోయిన శివగౌడ్.. పోలీసులు, కుటుంబ సభ్యులతో గొడవకి దిగాడు. ఈ క్రమంలోనే కన్న కొడుకును ఆటోకేసి బలంగా కొట్టాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఏడాది చిన్నారిని ఆటోకేసి కొట్టటంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. ఆ తర్వాతగానీ పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. 
 
చిన్నారిని అతని నుంచి బలవంతంగా తీసుకుని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. బలమైన గాయాలు తగలటంతో చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం తండ్రి శివగౌడ్ పరారీలో ఉన్నాడు. నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా కన్నబిడ్డను ఆటోకేసి కొట్టడానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కిరాతక తండ్రిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments