Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తు కలిపిన కూల్‌డ్రింక్స్‌ ఇచ్చిన శిరీష్ - హేమ.. జూ.ఆర్టిస్ట్‌పై గ్యాంగ్ రేప్ చేసిన ఫ్రెండ్స్

అమ్మాయిల పాలిట అమ్మాయిలే శత్రువులుగా మారుతున్నారు. తమ స్నేహితురాలికి మరో ఇద్దరు ఫ్రెండ్స్ మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్స్ ఇచ్చి ముగ్గురితో అత్యాచారం చేయించారు. అత్యాచారానికి గురైన యువతి ఓ జూనియర్ ఆర్ట

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (10:56 IST)
అమ్మాయిల పాలిట అమ్మాయిలే శత్రువులుగా మారుతున్నారు. తమ స్నేహితురాలికి మరో ఇద్దరు ఫ్రెండ్స్ మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్స్ ఇచ్చి ముగ్గురితో అత్యాచారం చేయించారు. అత్యాచారానికి గురైన యువతి ఓ జూనియర్ ఆర్టిస్ట్ కావడం గమనార్హం.
 
హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరుకు చెందిన శిరిష, హేమ లంగర్‌హౌస్‌లో ఓ హాస్టల్‌లో ఉంటూ జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్నారు. వీరి స్నేహితురాలు ఎల్లారెడ్డిగూడ హాస్టల్‌లో ఉంటోంది. కొద్దికాలం క్రితం ఆ యవతికి రాజ్‌కిరణ్ అనే ఆర్టిస్ట్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య చనువు పెరగడంతో రాజ్‌కిరణ్ ఆమెకు దగ్గరలోని ఓ హాస్టల్‌లో చేరాడు. 
 
వీరికి సినీ అవకాశాలు రాకపోవడంతో ఆర్టిస్టుల కోసం వీరిద్దరు 'మన' పేరుతో ఓ సంస్థను స్థాపించారు. సభ్యత్వం పేరుతో కొంత డబ్బు వసూలు చేశారు. అయితే, లెక్కల విషయంలో వారిమధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీన్ని మనసులో పెట్టుకున్న రాజ్‌కిరణ్.. తన స్నేహితులైన శిరీష, హేమ, బాధిత యువతులను గత మార్చి 5వ తేదీన గుంటూరు తీసుకెళ్లి ఓ లాడ్జిలో బస కల్పించాడు. అపుడే శిరీష, హేమలు కలిసి ఆ యువతికి శీతలపానియంలో మత్తు కలిపి ఇచ్చారు. 
 
దాన్ని సేవించిన బాధిత యువతి స్పృహకోల్పోగానే రాజ్‌కిరణ్‌తో పాటు మరో ముగ్గురు లైంగిక దాడిచేశారు. అయితే, అవకాశాలు తగ్గిపోతాయని ఆ యువతి నిమ్మకుండి పోయింది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా రాజ్‌కిరణ్ తిరిగి వేధించసాగాడు. పైగా, తన వద్ద గ్యాంగ్‌రేప్‌కు సంబంధించిన వీడియోలు ఉన్నాయంటూ బెదిరించసాగాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

టికెట్ రేట్స్ పై ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మంచిదే: తెలంగాణ చైర్మ‌న్‌ విజేంద‌ర్ రెడ్డి

బుర్ర కథా కళాకారిణి గరివిడి లక్ష్మి కథతో చిత్రం రూపొందబోతోంది

మెగాస్టార్ చిరంజీవి గారి ప్రోత్సాహంతో డ్రింకర్ సాయి అప్రిషియేషన్ : నిర్మాత బసవరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం