అండగా ఉంటానని అందాలను దోచుకున్నాడు.. ఇపుడు నగ్నంగా నిలబెట్టాడు...

ఇటీవల హైదరాబాద్‌లో ఓ పబ్‌లో బ్లేడ్‌ దాడికి గురైన బాధితురాలు షేక్ సమీర. ఈమె తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు చెప్పినా వారు స్పందించలేదు. దీంతో మీడియా ముందుకు వచ్చింది. తనకు అండగా ఉంటానని చెప్పి తన అందాల

Webdunia
శనివారం, 30 జూన్ 2018 (11:36 IST)
ఇటీవల హైదరాబాద్‌లో ఓ పబ్‌లో బ్లేడ్‌ దాడికి గురైన బాధితురాలు షేక్ సమీర. ఈమె తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు చెప్పినా వారు స్పందించలేదు. దీంతో మీడియా ముందుకు వచ్చింది. తనకు అండగా ఉంటానని చెప్పి తన అందాలను జుర్రుకున్న తన మాజీ ప్రియుడు.. ఇపుడు మరో యువతితో కలిసి తనపై బ్లేడ్‌తో దాడి చేయించి రోడ్డుపై నగ్నంగా నిలబెట్టాడని ఆరోపించింది.
 
గుంటూరు జిల్లాకు చెందిన షేక్ సమీరా అనే యువతి టీవీల్లో నటిస్తూ, దుబాయ్‌లో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈమెకు ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తర్వాత వీరిద్దరూ కొంతకాలం ప్రేమించుకున్నారు. అనంతరం అండగా ఉంటానని చెప్పి శారీరకంగా దగ్గరయ్యారు. 
 
ముఖ్యంగా, టీవీ సీరియల్స్‌లో అవకాశాలు ఇప్పిస్తానని ఫిరోజ్ దారుణంగా మోసం చేశాడని, మనస్పర్థలు వచ్చి తామిద్దరం విడిపోయామని షేక్ సమీరా వాపోతోంది. ఆ తర్వాత కీర్తితో ఫిరోజ్ పరిచయం పెంచుకున్నాడని, తన చేతులపై బ్లేడుతో ఫిరోజ్ ఖాన్ ప్రియురాలు కీర్తిరెడ్డే గాట్లు పెట్టిందని చెబుతూ వాటిని మీడియాకు చూపింది. 
 
పైగా, తనను గంటపాటు అర్థనగ్నంగా రోడ్డుపై నిలబెట్టారని, తననుంచి లక్షన్నర విలువ చేసే వాచీ, రెండు సెల్ ఫోన్లను లాక్కెళ్లారని వాపోయింది. పోలీసులు ఇంతవరకూ వారిని అరెస్ట్ చేయలేదని, తన పలుకుబడితో పోలీసులను ఫిరోజ్ మేనేజ్ చేస్తున్నాడని ఆరోపించింది. ఇప్పటికీ తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతూ, ఫిరోజ్‌కు, తనకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణల రికార్డును వినిపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran: ఇకపై మీరు గర్వపడేలా మూవీస్ చేస్తాను : కిరణ్ అబ్బవరం

Telusu kadaa Review: అమ్మాయిల ప్రేమలో నిజమెంత. సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ రివ్యూ

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments