Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుక్త వయసుకొచ్చిన కుమర్తెకు నీలి చిత్రాలు.. భార్య లేని సమయంలో అత్యాచారం

Webdunia
సోమవారం, 19 జులై 2021 (09:24 IST)
యుక్త వయసుకొచ్చిన కుమార్తెకు ఓ కామాంధ తండ్రి నీలి చిత్రాలు చూపించి, భార్య, కుమారుడు ఇంట్లో లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సభ్యసమాజం తలదించుకునేలా ఉన్న ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి హైదరాబాద్‌ నగరానికి వచ్చాడు. 
 
అక్కడ ఒక అపార్ట్‌మెంట్‌ వద్ద అతడు వాచ్‌మన్‌గా, భార్య పాచిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. భార్య ఇంట్లో లేని సమయంలో, యుక్తవయసుకు వచ్చిన కూతురితో తండ్రి చనువుగా ఉంటూ ఆమెకు నీలిచిత్రాలు చూపించేవాడు. 
 
పలుమార్లు శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ విషయం ఎవరికి చెప్పినా చంపేస్తానని బెదిరించడంతో కూతురు మౌనంగా ఉండిపోయింది. నెలలు గడిచేకొద్దీ కూతురిలోని శారీరక మార్పులను గమనించిన తల్లి ఆసుపత్రిలో చూపించింది.
 
ఐదు నెలల గర్భవతి అని వైద్యులు ధ్రువీకరించడంతో హతాశురాలైంది. ఈ విషయం బయటపడడంతో నిందితుడు రాత్రికి రాత్రే హైదరాబాద్‌ నుంచి కరప మండలంలోని బంధువుల ఇంటికి వచ్చి తలదాచుకున్నాడు. కూతురికి జరిగిన ఘోరాన్ని తల్లి తన పుట్టింటివారికి చెప్పడంతో బంధువులు, పలువురు గ్రామస్థులు నిందితుడి కోసం గాలించారు. 
 
వేములవాడలో ఉన్నట్టు సమాచారం అందడంతో అతడిని పట్టుకుని వాకాడ బస్‌ స్టాండ్‌ వద్ద ఒక చెట్టుకు కట్టి చితకబాదారు. కరప పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని విడిపించి స్టేషన్‌కు తరలించారు. నిందితుడిని హైదరాబాద్‌ పోలీసులకు అప్పగిస్తామని కరప పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం