Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిరోడ్డుపై బైక్ ఆపేసి పరిగెత్తిన భర్త.. అవాక్కైన భార్య.. ఎందుకు?

Webdunia
ఆదివారం, 10 జనవరి 2021 (18:45 IST)
పోలీసులను చూసి బైక్ ఆపేసి భర్త పారిపోయాడు. భార్యకు సిటీలో ఇంటి అడ్రస్ సరిగ్గా తెలియకపోవడంతో అక్కడే ఏడుస్తూ కూర్చుంది. పోలీసులు వివరాలు సేకరించి క్షేమంగా అప్పగించారు.
 
భార్యను బైక్‌పై ఎక్కించుకుని వస్తున్న భర్త ఉన్నట్టుండి బండి ఆపేశాడు. అక్కడి నుంచి పరుగు లంఘించుకున్నాడు. ఎందుకు పారిపోతున్నాడో తెలియని భార్య షాక్‌కి గురైంది. నడిరోడ్డుపై నిల్చుండిపోయింది. భర్త రాకపోవడంతో ఏడుస్తూ కూర్చున్న భార్యని గమనించిన పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె భర్తని పిలిపించి భద్రంగా అప్పజెప్పారు. ఈ షాకింగ్ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది.
 
శంషాబాద్ సమీపంలో బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి వద్ద ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. డ్రంకెన్ డ్రైవ్ చెకింగ్ చేస్తుండటంతో అటువైపుగా బైక్‌పై వస్తున్న రాజు సడెన్‌గా బండి ఆపేశాడు. భార్య సీతను నడిరోడ్డుపై వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. భర్త ఎందుకు పారిపోతున్నాడో తెలియని ఆమె షాక్‌కి గురైంది. 
 
అయితే ఆమెకు ఇంటి అడ్రస్ కూడా సరిగ్గా తెలియకపోవడంతో దిక్కుతోచని స్థితిలో అక్కడే నిలుచుండిపోయింది. కొద్దిసేపటికి పక్కనే ఉన్న శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ పరిసరాల్లోకి వెళ్లి కూర్చుంది. అక్కడ ఏడుస్తూ కూర్చున్న సీతని ఎయిర్‌పోర్ట్ మొబైల్ పోలీసులు గమనించారు. ఆమెను స్టేషన్‌కి తీసుకెళ్లి ధైర్యం చెప్పి వివరాలు సేకరించారు. భర్త రాజును పిలిపించి భార్యను భద్రంగా అప్పజెప్పారు. డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిపోతానన్న భయంతోనే రాజు పారిపోయాడట! 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుర్రం పని గుర్రం చేయాలి.. గాడిద పని గాడిద చేయాలి : పోసాని - వర్మలకు ఈ సామెత తెలియదా?

ఒకే చోటు ప్రత్యక్షమైన ధనుష్ - నయనతార - ముఖాలు చూసుకోని హీరోహీరోయిన్లు

ఇడ్లీ కడై నిర్మాతకు పెళ్లి.. ఒకే వేదికపై నయన, ధనుష్.. మాట్లాడుకున్నారా?

చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఆర్సీ16 ప్రారంభం

విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి వేడుకలు... డేటింగ్‌లో 'గీతగోవిందం' జంట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments