Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీన్స్ ప్యాంటును ఇస్త్రీకి ఇస్తే.. రూ.3.5 లక్షల్ని కొట్టేశాడు..

జీన్స్ ప్యాంటును ఇస్త్రీకి ఇస్తే.. ప్యాంటు జేబులో ఉన్న రూ.3లక్షల డబ్బును షాపు ఓనర్ నొక్కేశాడు. ఈ ఘటన హైదరాబాదు శివారు ఆల్వాల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ వెంకటాపురం దినకర్ నగర్ ప్రాం

Webdunia
మంగళవారం, 9 మే 2017 (13:56 IST)
జీన్స్ ప్యాంటును ఇస్త్రీకి ఇస్తే.. ప్యాంటు జేబులో ఉన్న రూ.3లక్షల డబ్బును షాపు ఓనర్ నొక్కేశాడు. ఈ ఘటన హైదరాబాదు శివారు ఆల్వాల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ వెంకటాపురం దినకర్ నగర్ ప్రాంతానికి చెందిన ఇమ్మడి నాగేశ్వరరావు ఎల్‌ఎల్‌బీ చదువుతున్నాడు.

పదో  రోజుల క్రితం మూడున్నర లక్షల రూపాయల్ని తన జీన్స్ ప్యాంటులో ఉంచి బీరువాలో భద్రపరిచాడు. కానీ డబ్బు వుంచిన విషయాన్ని మరిచిపోయిన నాగేశ్వరరావు... ఈ నెల నాలుగో తేదీన ఇస్త్రీ కోసం ఆ ప్యాంటును నాగరాజు అనే వ్యక్తికి ఇచ్చాడు. ఆరో తేదీ ఇస్త్రీకి ఇచ్చిన ప్యాంటును తెచ్చుకున్నాడు. 
 
అయితే అందులో పెట్టిన మూడున్నర లక్షల డబ్బు సంగతిని లేటుగా గుర్తు చేసుకున్న నాగేశ్వరరావు షాక్ అయ్యాడు. ప్యాంటులో ఉన్న డబ్బును చూశావా అంటూ ఇస్త్రీ చేసిన వ్యక్తి నాగరాజును అడిగాడు. అయితే నాగరాజు తాను డబ్బు చూడలేదని చెప్పడంతో నాగేశ్వరరావు ఆల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకుని, తమదైన శైలిలో విచారించగా, డబ్బు తీసుకున్నట్లు అంగీకరించాడు. 
 
ఇంటి ముందు గొయ్యి తీసి, అందులో డబ్బు పెట్టానని... రూ. 30 వేలు ఖర్చు చేశానని చేసిన తప్పును అంగీకరించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగరాజు వద్ద నుంచి రూ. 3.20 లక్షల సొమ్మును స్వాధీనం చేసుకుని, నాగేశ్వరరావుకు అప్పగించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments