Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్ల చిన్నవాడిని పెళ్లి చేసుకుంది: గర్భవతిని చేశాడు.. తల్లిదండ్రుల వెంట వెళ్ళిపోయాడు.. బ్లేడుతో?

ఆమెకు 27 ఏళ్లు. అయినా ఆరేళ్ల చిన్నవాడిని పెళ్లి చేసుకుంది. అంతకుముందు విడాకులైనా.. ఆ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. గర్భవతిని చేశాడు. అయితే తల్లిదండ్రులకు వచ్చే సరికి ఫ్లేటు ఫిరాయించాడు. తల్లిదండ్రులకు

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (17:28 IST)
ఆమెకు 27 ఏళ్లు. అయినా ఆరేళ్ల చిన్నవాడిని పెళ్లి చేసుకుంది. అంతకుముందు విడాకులైనా.. ఆ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. గర్భవతిని చేశాడు. అయితే తల్లిదండ్రులకు వచ్చే సరికి ఫ్లేటు ఫిరాయించాడు. తల్లిదండ్రులకు చెప్పకుండా తప్పు చేశానంటూ వారి వెంటే వెళ్ళిపోయాడు. ఇలా భర్తను ఆతని తల్లిదండ్రులు వెంటబెట్టుకుని వెళ్ళిపోయే సరికి గర్భవతి అయిన ఆమె ఆత్మాహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన గుంతకల్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. గుంతకల్‌కు చెందిన రాజేశ్వరి (27) అప్పటికే పెళ్లై విడాకులు తీసుకుంది. తనకన్నా ఆరేళ్లు చిన్నవాడైన కర్నూలు యువకుడు సాయి ఈశ్వర్‌ను ఫేస్ బుక్ లో చూసి ఇష్టపడింది. ప్రేమకు వయసు అడ్డుకాదని భావించిన ఈశ్వర్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ కలసి హైదరాబాద్‌లో కాపురం పెట్టగా, రాజేశ్వరి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ప్రస్తుతం ఆమె గర్భవతి. 
 
అయితే తన కుమారుడికి పెళ్ళైందని, హైదరాబాదులో ఉన్నాడని తెలుసుకున్న ఈశ్వర్ తల్లిదండ్రులు రాజేశ్వరి కాపురంలో చిచ్చు పెట్టారు. తమ బిడ్డ ఇంకా మైనరేనని, 21 సంవత్సరాలు దాటలేదని చెబుతూ అతన్ని తీసుకెళ్లారు. ఆపై భర్త కోసం కర్నూలు వెళ్లిన రాజేశ్వరికి తీవ్ర నిరాశ ఎదురైంది. 
 
తాను తల్లిదండ్రులతోనే ఉంటానని ఈశ్వర్ చెప్పడంతో బ్లేడుతో చెయ్యి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రాణాపాయం నుంచి బయటపడింది. తన భర్తను పంపాలని వేడుకుంటోంది. అయితే ఈశ్వర్ మాత్రం తల్లిదండ్రుల మాటే వింటానని అంటున్నాడు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం