Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీడియో గేమ్ కోసం బీటెక్ స్టూడెంట్ సూసైడ్ ఎక్కడ?

వీడియో గేమ్ కోసం బీటెక్ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్న సంఘటన ఒకటి జరిగింది. అదీకూడా తండ్రి ఈ వీడియో గేమ్ కొనివ్వలేదనీ ఈ దారుణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరిగిన ఈ విషాదకర సంఘటన వివరాలను

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2017 (16:29 IST)
వీడియో గేమ్ కోసం బీటెక్ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్న సంఘటన ఒకటి జరిగింది. అదీకూడా తండ్రి ఈ వీడియో గేమ్ కొనివ్వలేదనీ ఈ దారుణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరిగిన ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్ శివారు ప్రాంతమైన కుంట్లూరులో నివసించే శ్రీనివాస్, పద్మ దంపతులకు అభినయ్ అనే బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న కొడుకు ఉన్నాడు. ఇటీవలే వారు కొత్తగా రెండంతస్తుల భవనాన్ని నిర్మించుకుని గృహప్రవేశం కూడా చేశారు. ఈ నెల 2న నాదెర్గుల్‌లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో అభినయ్ చేరాడు.
 
అయితే, అభినయ్‌కు వీడియో గేమ్‌లు ఆడటం అంటే మహాపిచ్చి. దీంతో తనకు ఒక వీడియో గేమ్ కొనిపెట్టాలని తండ్రిని కోరాడు. కానీ త‌మ వ‌ద్ద డ‌బ్బులేద‌ని తండ్రి చెప్పుకొస్తున్నాడు. త‌న‌కు వీడియో గేమ్ కొనిస్తారా? లేదా? అంటూ సోమవారం త‌నతో గొడ‌వ‌కు దిగిన ఆ బాలుడిని అత‌డి తండ్రి మందలించాడు. దీంతో మన‌స్తాపానికి గురైన ఆ బాలుడు త‌మ భ‌వ‌నం పైకి వెళ్లి కింద‌కు దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు జ‌రుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప-3లో జాన్వీ కపూర్ ఐటెమ్ సాంగ్ చేస్తే అదిరిపోద్ది.. డీఎస్పీ

సినీ నిర్మాతల గృహాల్లో ముగిసిన ఐటీ సోదాలు...

దిల్ రాజు ఆస్తులపై ఐటి దాడులు- వెంకటేష్ తో సినిమా ప్రచారం.. ఆంతర్యం?

Sai Pallavi :హైలెస్సో హైలెస్సా అంటూ ప్రేమలో జీవించిన నాగ చైతన్య, సాయి పల్లవి

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments