Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ దిగండి.. రూ.50 చెల్లించండి.. కళాకారుడు నూకాజీ రూటే.. సెప'రేటు'

Webdunia
బుధవారం, 20 నవంబరు 2019 (14:02 IST)
సమయం: ఉదయం 7 గంటలు 
ఎక్కడ: ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ 2వ నెంబరు ఫ్లాట్‌ఫాం
ఏం జరిగింది: ఉన్నట్టుండి మెడలో పేటీఎం ట్యాగ్‌తో ఆంజనేయస్వామి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. 
ఆశ్చర్యపోకండి: ఆంజేయస్వామి వేషధారణలో ఉన్న కళాకారుడు నూకాజీ అన్నమాట.
ఇతని ప్రత్యేకత ఏంటంటారా.? అతనితో మీరు సెల్ఫీ దిగాలనుకుంటే రూ.50 చెల్లించాలి. డబ్బులు లేకపోతే.. ముందు సెల్ఫీ దిగండి.. తీరిగ్గా ఇంటికి వెళ్లి డబ్బు పేటీఎంలో పంపండి అంటూ ఉచిత సలహా ఇస్తున్నాడు.
 
ఎవరీయన?
తూర్పు గోదావరి జిల్లా తునికి చెందిన నూకాజీ ఎల్‌ఎల్‌బీ వరకు చదువుకున్నారు. నాటకరంగ కళాకారుడైన ఆయన బతుకుదెరువుకు కళనే నమ్ముకున్నాడు. నాటకాలకు అంతగా ఆదరణ లేదని తెలుసుకున్న నూకాజీకి ఓ ఆలోచన వచ్చింది. విభిన్న వేషధారణలతో నగరంలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతుంటాడు. క్రికెటర్‌గా, ఆంజనేయస్వామిగా, ఇంకోసారి మరో ఆధ్యాత్మిక రూపంలో కనిపిస్తుంటాడు.
 
రోజుకు రూ.వెయ్యికి తగ్గకుండా..: 
నూకాజీ రోజువారీ ఆదాయం రూ.వెయ్యికి తగ్గకుండా ఉంటుంది. ఒక్కోసారి కొందరు రూ.100, రూ.200, రూ.500 వరకు తనకు పేటీఎం చేస్తుంటారని తెలిపాడు.
 
అన్నట్టు పెళ్లటండోయ్‌..: 
నూకాజీ ఇక బ్యాచిలర్‌ జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెట్టి వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానని, ఇందుకు తనకు సహకరించాలని కరపత్రాలు కూడా పంచిపెడుతున్నాడు. ఊరకే ఏం డబ్బు ఇవ్వద్దండీ... ఓ సెల్ఫీ దిగండి అంటూ ఆఫర్‌ ఇస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments