Webdunia - Bharat's app for daily news and videos

Install App

మతం మార్చుకుంటేనే కోడలితో కాపురమన్న తల్లి.. సరేనంటూ తలూపిన కొడుకు... ఎక్కడ?

ప్రేమ పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన కోడలికి అత్త వైపు నుంచి వేధింపులు మొదలయ్యాయి. కోడలు మతం మార్చుకుంటేనే కాపురం చేయమని కొడుక్కి షరతు విధించింది. తల్లిమాట జవదాటని కొడుకు... భార్యను వేధించసాగాడు.

Webdunia
శనివారం, 12 ఆగస్టు 2017 (11:16 IST)
ప్రేమ పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన కోడలికి అత్త వైపు నుంచి వేధింపులు మొదలయ్యాయి. కోడలు మతం మార్చుకుంటేనే కాపురం చేయమని కొడుక్కి షరతు విధించింది. తల్లిమాట జవదాటని కొడుకు... భార్యను వేధించసాగాడు. పైగా, మతం మార్చుకోవాల్సిందేనని, అప్పటివరకు కాపురం చేసే ప్రసక్తే లేదని చెపుతూ భార్యను వీధిపాలు చేశాడు. అనంతపురం జిల్లా పెనుకొండలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జిల్లాలోని బుక్కపట్నానికి చెందిన దీపకు పెనుకొండవాసి అనిల్‌కుమార్‌తో 2014లో పరిచయమైంది. పుట్టపర్తి కళాశాలలో చదువుకునే సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగామారి పెళ్లి చేసుకున్నారు. మతాలు వేరైనప్పటికీ ఇంటి పెద్దలను ఎదిరించి 2016లో కుటుంబ సభ్యుల సమక్షంలో తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు.
 
కొద్దిరోజులు హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో కాపురం ఉన్నారు. ఆ తర్వాత తల్లి, బంధువుల ఒత్తిడికి తలొగ్గిన అనిల్‌.. భార్యను వేధించసాగాడు. యేడాదిగా అత్తతో పాటు భర్త చిత్రహింసలను మౌనంగా భరిస్తూ వచ్చిన రూప... ఏరోజైనా భర్త మారి ఆదరించకపోతాడా అని ఎదురు చూసింది. ఇప్పటికే పెద్దల సమక్షంలో పంచాయితీ, పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చినా.. వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. చివరకు ఆమెను వదిలించుకునే ప్రయత్నాలు మొదలెట్టారు. దీంతో ఆమె అత్తింటికి చేరి ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments