Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ఎదుటే ప్రియురాలితో భర్త రొమాన్స్.. ఆ తరువాత?

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (15:01 IST)
భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని సహించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖ జిల్లా నక్కపల్లిలో చోటుచేసుకుంది. మండలంలోని డి.కొత్తూరుకు చెందిన నాగవెంకట వరలక్ష్మికి నక్కపల్లికి చెందిన కొప్పిశెట్టి చినరాజుతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు పుట్టలేదు. దీంతో చినరాజు ఆమెను పట్టించుకోవడం మానేసి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
 
భార్య ఎదుటే ప్రియురాలితో సన్నిహితంగా ఉంటూ తీవ్రంగా వేధించాడు. దీనికితోడు అత్తమామలు కూడా వరలక్ష్మిని సూటిపోటి మాటలతో వేధించేశారు. మంగళవారం రాత్రి తన ప్రియురాలిని ఇంటికి తీసుకొచ్చి భార్య ఎదుటే గదిలోకి వెళ్లి రాసలీలలు కొనసాగించాడు భర్త. 
 
ఈ వ్యవహారాన్ని సహించలేకపోయిన వరలక్ష్మి భర్తతో గొడవ పడింది. ఆవేశంలో మేడపైకి వెళ్లి కిందికి దూకేసింది. ఈ ఘటనలో ఆమెకి స్వల్ప గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళుతూ మార్గమధ్యంలో దుర్భాషలాడుతూ ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో మనస్థాపానికి గురైన వరలక్ష్మి ఇంటికొచ్చిన తర్వాత గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
 
ఆత్మహత్యకు ముందు కొత్తూరులో ఉండే తన అక్క లావణ్యకు వాట్సాప్‌‌లో విషయం చెప్పింది. తన మృతికి భర్త, అత్త, ఆడపడుచు, తన భర్త ప్రియురాలే కారణమని ఆరోపించింది. ఆమె అప్రమత్తమై బంధువులను హెచ్చరించే లోగానే వరలక్ష్మి ఉరి వేసుకుని చనిపోయింది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వారందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments