Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంపన్న కుటుంబం... కోటీశ్వర భర్త.. పరాయి పురుషుడిపై మోజు...

Webdunia
బుధవారం, 5 డిశెంబరు 2018 (08:59 IST)
ఓ మహిళ పరాయి వ్యక్తి మోజులోపడి చివరకు కట్టుకున్న భర్తనే కడతేర్చాలని ప్లాన్ చేసింది. చివరకు కట్టుకున్న భర్త చేతిలో ప్రియుడు హత్యకు గురికాగా, ఆ మహిళ మాత్రం జైలుపాలైంది. హైదరాబాద్ బీఎన్‌రెడ్డి నగర్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
నాగర్‌కర్నూలు జిల్లా, ఉరుకొండ మండలం, రచ్చలపల్లికి చెందిన గంగాపురం శ్రీధర్‌ రెడ్డికి అనే వ్యక్తికి అశ్విని అనే యువతితో గత 2009లో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లల చదువుకోసమని శ్రీధర్‌ రెడ్డి కల్వకుర్తి వచ్చి అద్దె ఇంట్లో ఉండగా.. అదే ఇంట్లోని పై అంతస్తులో శ్రీనివాస్ గౌడ్‌ తన భార్య, పిల్లలతో అద్దెకు నివశించేవాడు. 
 
ఈ క్రమంలో అశ్విని.. శ్రీనివాస్ గౌడ్‌ల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్త శ్రీధర్ రెడ్డికి తెలిసి ఆమెను మందలించాడు. కానీ, ఆమె మాత్రం భర్త అడ్డు తొలగించుకుని ప్రియుడితో జీవించాలని పథకం వేసింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీధర్ రెడ్డి తన స్నేహితులతో కలిసి శ్రీనివాస్ గౌడ్‌ను హత్య చేశాడు. మిస్టరీగా మారిన ఈ హత్య కేసును హైదరాబాద్ నగర పోలీసులు ఛేదించారు. 
 
నిజానికి, శ్రీధర్ రెడ్డిది సంపన్న కుటుంబం. ఒకే ఒక్క కుమారుడు. కోటీశ్వరుడు. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్న అశ్విని కాపురం హాయిగా సాగిపోతోంది. కానీ, శ్రీనివాస్ గౌడ్ అనే పరాయి పురుషుడుతో వివాహేతర సంబంధం పెట్టుకుని నూరేళ్ల జీవితాన్ని పాడుచేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments