Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇందిరమ్మ ఇంటి కోసం కట్టుకున్న భార్యనే కడతేర్చిన కసాయి భర్త

ఇందిరమ్మ ఇంటి కోసం కట్టుకున్న భార్యనే ఓ కసాయి భర్త కడతేర్చాడు. ఈ దారుణ హత్య గుంటూరు జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... వట్టిచెరుకూరు సౌపాడు దళితవాడకు చెందిన మౌనిక, నూతనపాటి వెంకటేశ్వర్లుకు గ

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2017 (07:03 IST)
ఇందిరమ్మ ఇంటి కోసం కట్టుకున్న భార్యనే ఓ కసాయి భర్త కడతేర్చాడు. ఈ దారుణ హత్య గుంటూరు జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... వట్టిచెరుకూరు సౌపాడు దళితవాడకు చెందిన మౌనిక, నూతనపాటి వెంకటేశ్వర్లుకు గతంలోనే రెండు సార్లు వివాహాలు జరిగాయి. వారు విడిపోయారు. చివరకు వీరు యేడాది క్రితం వివాహం చేసుకున్నారు. మొదట ఆరు నెలలు ప్రకాశం జిల్లా అమ్మడపూడిలో కాపురం పెట్టారు. వెంకటేశ్వరరావు నిరంతరం భార్యతో గొడవ పడేవాడు.
 
ఈ క్రమంలో వృద్ధులైన యువతి తల్లిదండ్రులు వారిని సౌపాడులోని తమ ఇంటికి తెచ్చుకున్నారు. వెంకటేశ్వరరావుకు ఇల్లరికం రావడం ఇష్టంలేదు. నిత్యం మద్యం సేవించి వేధించేవాడు. వివాహ సమయంలో తన ఇందిరమ్మ ఇంటిని మౌనిక పేరుతో రాశాడు.
 
దీంతో ఇంటిని చేజిక్కించుకునేందుకు ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 9న పెళ్లి రోజున మౌనిక తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా మధ్యాహ్నం సమయంలో ఇంటిలో ఉన్న గొడ్డలితో ఆమె తలపై మోదీ హత్య చేసి పారిపోయాడు. దీనిపై సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న వెంకటేశ్వర రావును అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments