Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ వండటం చేతకాదని.. భార్యను పుట్టింటికి పంపించాడు

బిర్యానీ వండటం చేతకాదనే సాకుతో పెళ్లైన రెండు నెలలకే భార్యను పుట్టింటికి పంపించాడు ఓ భర్త. అయితే భర్త ఇంటిముందు న్యాయం కోసం భార్య మౌన దీక్షకు దిగింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వ

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2017 (10:36 IST)
బిర్యానీ వండటం చేతకాదనే సాకుతో పెళ్లైన రెండు నెలలకే భార్యను పుట్టింటికి పంపించాడు ఓ భర్త. అయితే భర్త ఇంటిముందు న్యాయం కోసం భార్య మౌన దీక్షకు దిగింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్‌కు ఖాజిపేటదర్గాకు చెందిన మానసతో 2016 నవంబర్‌లో వివాహం జరిగింది. రాజేంద్రపసాద్‌కు కట్నంగా రూ.7లక్షలిచ్చారు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేస్తూ.. రోజూ తాగి వచ్చే రాజేంద్రప్రసాద్ బిర్యానీ వండటం రాదనే నెపంతో రెండు నెలలకే భార్యను పుట్టింటికి పంపాడు. 
 
పది నెలలు గడిచినా తీసుకెళ్లేందుకు రాకపోవడంతో బాధితురాలు భర్త ఇంటిముందు న్యాయపోరాటానికి దిగింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది.  తనకు న్యాయం జరిగే వరకు భర్త ఇంటి నుంచి కదిలేదిలేదని ఆమె భీష్మించుకుని కూర్చుంది. ఈ  ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. రోజూ తాగొచ్చి కొట్టేవాడని.. ఇలా కొట్టీ కొట్టీ చేయి కూడా వంకరపోయిందని.. బయటి తిండికి అలవాటు పడి రోజూ బిర్యానీ చేయాలని వేధించే వాడని బాధితురాలు పోలీసులతో వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments