Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెంపలపై కొట్టి.. చున్నీతో మెడబిగించి హత్య చేసిన భర్త... ఏమీ తెలియనట్టుగా కేకలు..

కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న కసాయి భర్త... ఆమెను కొట్టి చంపిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా మాచవరం మండలంలో ఈ దారుణం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (12:32 IST)
కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న కసాయి భర్త... ఆమెను కొట్టి చంపిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా మాచవరం మండలంలో ఈ దారుణం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామానికి చెందిన ఫిరంగి సాయికృష్ణతో రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామానికి చెందిన నాదెండ్ల నాగేశ్వరరావు కుమార్తె రజని (20)కి గతేడాది వివాహమైంది. గత ఆరునెలలుగా భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య తరచూ చిన్నపాటి గొడవలు జరుగుతూ వచ్చాయి. భర్తతో కలిసి జీవించలేక రజనీ పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
అయితే, తల్లిదండ్రులతో పాటు పంచాయతీ పెద్దలు నచ్చజెప్పి తిరిగి కాపురానికి పంపించారు. బుధవారం ఉదయం భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో భర్త సాయికృష్ణ, భార్య రజనిని ముందుగా చెంపలపై కొట్టి తర్వాత చున్నీతో మెడబిగించి చంపివేశాడు. ఆ తర్వాత తనకేం తెలియనట్టుగా ఎరగనట్లు కేకలు వేశాడు. ఈ అరుపులు విన్న చుట్టుపక్కల వారు.. ఇంటికి వచ్చి చూడగా, రజనీ కిందపడిపోయివున్నది. 
 
దీంతో సమాచారాన్ని రజినీ తల్లిదండ్రులకు చేరవేశారు. తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటిన పిన్నెల్లి గ్రామానికి చేరుకున్నారు. బంధువులు, తల్లిదండ్రులు సాయికృష్ణను నిలదీసి అడుగగా అనుమానంతో తానే చంపానంటూ అంగీకరించాడు. రజనీ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments