Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త కువైట్‌లో... విరహం తట్టుకోలేక పదోతరగతి విద్యార్థితో వివాహిత..?

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (22:10 IST)
అక్రమ సంబంధాల కారణంగా ఎన్నో జీవితాలు నాశనమైపోతున్నాయి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో కొంతమంది అర్థాంతరంగా తమ జీవితాలనే నాశనం చేసేసుకుంటున్నారు. పచ్చటి సంసారాలు కాస్త కూలిపోవడానికి అక్రమ సంబంధాలే కారణంగా మారుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఆ సంబంధం కారణంగా మరణించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అంతేకాదు కుటుంబాలు విడిపోవడానికి కారణమవుతున్నాయి. 
 
నెల్లూరు జిల్లా కావలిలో ఇలాంటి సంఘటనే జరిగింది. గత మూడురోజులకు క్రితం సూళ్ళురుపేటలో ఒక అమ్మాయిపై దారుణంగా గ్యాంగ్ రేప్ జరిగిన సంఘటన మరువకముందే వివాహేతర సంబంధంతో ఒక కుటంబం రోడ్డుపైకెక్కింది. షేక్ ఆలీ స్థానికంగా పెయింటర్ పని చేస్తున్నాడు. అతనికి సంవత్సరం క్రితం వివాహమైంది. ఇప్పటివరకు పిల్లలు లేరు. అయితే ఆర్థిక స్థోమత సరిగ్గా లేకపోవడంతో షేక్ ఆలీ కువైట్‌కు వెళ్ళాడు. 
 
రెండునెలల క్రితం కువైట్‌కు వెళ్లడంతో అతని భార్య ఒకటే ఇంట్లో ఉంటోంది. తన బంధువులు కూడా అదే ప్రాంతంలో ఉండడంతో నమ్మకంతో షేక్ ఆలీ వదిలి కువైట్‌కు వెళ్ళాడు. అయితే విరహం తట్టుకోలేని వివాహిత నెలరోజుల నుంచి ఇంటి పక్కనే ఉన్న 10వ తరగతి చదువుతున్న నాని అనే  యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. గుట్టుచప్పుడు సాగుతున్న ఈ వ్యవహారం కాస్త రెండురోజుల క్రితం షేక ఆలీ బంధువులకు తెలిసిపోయింది. 
 
దీంతో ఆ యువకుడిని పట్టుకుని దేహశుద్థి చేసి పోలీసులకు అప్పగించారు. వివాహితకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు. అయితే షేక్ ఆలీ బంధువులు మాత్రం వివాహిత ఇంట్లో ఉండడానికి వీల్లేదంటూ ఆమెను ఇంటి నుంచి పుట్టింటికి పంపేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం