Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసహజ శృంగారానికి ఒత్తిడి.. కాపురానికిరాని భార్య... గొంతుకోసిన భర్త.. ఎక్కడ?

అసహజ శృంగారం చేయాలంటూ రెండో భర్త ఒత్తిడి చేయడంతో ఆ భార్య అమ్మగారింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత భర్త వెళ్లి కాపురానికి రావాలంటూ పలుమార్లు పిలిచినా ఆమె రాలేదు. దీంతో ఆగ్రహించిన రెండో భర్త బ్లేడుతో భార్య

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (09:02 IST)
అసహజ శృంగారం చేయాలంటూ రెండో భర్త ఒత్తిడి చేయడంతో ఆ భార్య అమ్మగారింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత భర్త వెళ్లి కాపురానికి రావాలంటూ పలుమార్లు పిలిచినా ఆమె రాలేదు. దీంతో ఆగ్రహించిన రెండో భర్త బ్లేడుతో భార్య కొంతుకోశాడు. 
 
మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి చెందినబోయ కవితను యాగంటిపల్లె గ్రామానికి చెందిన గోపాల్‌ అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. ఈయనకు తాగుడు అలవాటు ఉంది. పైగా, భార్యను నిత్యం వేధించసాగాడు. దీంతో భర్త నుంచి విడిపోయి, కూలిపని చేసుకుంటూ జీవనం సాగించసాగింది. 
 
ఈ క్రమంలో ఓ మధ్యవర్తి ద్వారా రామక్రిష్ణాపురం గ్రామానికి చెందిన బాలయోసు అనే వ్యక్తితో ఇద్దరికీ 10 రోజుల క్రితం వివాహం చేశారు. బాలయేసు కూడా భార్యపై అనుమానంతో వేధింపులకు గురిచేస్తుండడంతో పాటు అసహజశృంగారం చేయాలంటూ ఒత్తిడి చేయసాగాడు. దీంతో ఆమె కాపురానికి వెళ్లలేదు. 
 
ఇదే విషయంపై పెట్రోల్‌బంకు కూడలిలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఆవేశానికి గురైన భర్త బాలయేసు వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో భార్య గొంతు కోశాడు. దీన్ని చూసిన స్థానికులు బాలయేసును పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత రక్తపు మడుగులో ఉన్న కవితను సమీపంలోని ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments