Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమానం పెనుభూతమై.. కత్తితో భార్య మెడకోసిన భర్త....

Webdunia
సోమవారం, 29 జూన్ 2015 (09:33 IST)
అనుమానం పెనుభూతమైంది. ఫలితంగా ఓ భర్త ఉన్మాదిగా మారాడు. తొలుత అనుమానితుడిపై గొడ్డలితో దాడి చేసిన ఆ తర్వాత తన భార్య మెడకోశాడు. పిమ్మట తాపీగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లో ఆదివారం చోటుచేసుకున్నాయి. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... 
 
హయత్‌నగర్, అనాజ్‌పూర్‌ గ్రామానికి చెందిన ఏర్పుల దానయ్య, రాములమ్మ భార్యాభర్తలు. అదే గ్రామానికి చెందిన పోలమోని అశోక్ అనే వ్యక్తి గ్రామంలో చికెన్ సెంటర్‌ నడుపుతున్నాడు. అయితే, తన రాములమ్మకు అశోక్‌తో వివాహేతర సంబంధం ఉందని దానయ్య అనుమానిస్తూ వచ్చాడు. 
 
ఆదివారం ఉదయం 5 గంటలకు అశోక్‌ చికెన్‌ సెంటర్‌ వద్దకు దానయ్య వెళ్లి అతడితో ఉద్దేశపూర్వకంగా గొడవపడ్డాడు. దీంతో ఆగ్రహానికి లోనైన దానయ్య.. అశోక్‌ ఎడమచేతిపై గొడ్డలితో దాడిచేశాడు. ఇద్దరి మధ్య జరిగిన పెనుగులాటలో గొడ్డలి కిందపడిపోగానే చికెన్ సెంటర్‌లో ఉన్న మాసం కోసే కత్తిని కత్తిని అందుకుని అశోక్‌ కాళ్లపై పొడిచాడు. ఆ తర్వాత తూకం రాయితో దాడిచేయడంతో అశోక్‌ కణితికి దెబ్బ తగలడంతో తీవ్రమైన గాయమైంది. 
 
అక్కడి నుంచి ఆవేశంగా ఇంటికెళ్లిన దానయ్య తన చేతిలో ఉన్న కత్తితో భార్య మెడ కోశాడు. రాములమ్మ కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి రావడంతో పారిపోయి పోలీసులు లొగింపోయాడు. సమాచారం అందుకున్న హయత్‌నగర్‌ సీఐ వెంకటేశ్వర్‌రావు, ఎస్‌ఐ మన్మథకుమార్‌ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. గొడ్డలి, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. రాములమ్మను ఉస్మానియా, అశోక్‌ను సన్‌రైజ్‌ ఆస్పత్రులకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments