Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగనన్న గోరు ముద్ద ఎలా వుంది? ఆకస్మిక త‌నిఖీ చేసిన మంత్రి వెలంప‌ల్లి

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (19:00 IST)
గ‌త తెలుగుదేశం ప్ర‌భుత్వ‌ హ‌యంలో విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం అభివృద్దికి నోచుకోకుండా నిర్ల‌క్ష్యానికి గురైయింద‌ని, ప్ర‌చారానికి ప‌రిమితం అయిన టిడిపికి ప్ర‌జ‌లు బుద్ది చెప్పార‌ని  దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు అన్నారు.

శ‌నివారం  42 మరియు 43వ డివిజన్లకు సంబంధించి  పాత MIG రోడ్డు, హెచ్ బి కాలని  మసీదు రోడ్డు, అప్నా బజర్ రోడ్డు నుంచి బైపాస్ రోడ్ల వ‌ర‌కు  రూ.105.00 లక్షల అంచనా వ్యయంతో మసీదు రోడ్డులోని అన్యా అపార్టుమెంటు వ‌ద్ద‌ బి.టి.రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు శుంకుస్థాప‌న చేశారు. విజ‌య‌వాడ‌ను మెడ‌ల్ డివిజ‌న్ గా  అభివృద్ది చేస్తామ‌న్నారు.  కార్య‌క్ర‌మంలో మేయ‌ర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేట‌ర్లు, న‌గ‌ర పాల‌క సంస్థ అధికారులు  పాల్గొన్నారు. 
 
న‌గ‌రంలో సుడి గాలి ప‌ర్య‌ట‌న చేసిన మంత్రి వెలంప‌ల్లి
ర‌హ‌దారుల నిర్మాణ ప‌నుల‌కు శుంకుస్థాపన అనంత‌రం మంత్రి న‌గ‌రంలో ప‌లు ప్రాంతాలు ప‌ర్య‌టించారు..హెచ్‌బి కాల‌నీలో 3 కోట్లు రూపాయ‌ల‌తో 1500కెల్ కెపాసిటి గ‌ల వాట‌ర్ ట్యాంక్  నిర్మాణం పూర్తి  అయిందని విద్యుత్ స‌ర‌ఫ‌రా ప‌నులు పూర్తి కాగ‌నే త‌ర్వ‌లో అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌న్నారు..  ఫోన్‌లో ఎస్ఈతో మాట్లాడిన మంత్రి త‌ర్వ‌లో విద్యుత్ స‌ర‌ఫ‌రా  ప‌నులు  పూర్తి చేయాల‌ని అదేశించారు. అనంత‌రం రైతుబ‌జార్‌, రామ్మెహ‌న్ అపార్టుమెంట్ త‌దిత‌ర ప్రాంతాల‌ను మంత్రి ప‌ర్య‌టించారు. రైతుబ‌జార్‌ను త‌నిఖీ చేసిన మంత్రి స్థానికుల‌ను  రామ్మెహ‌న్ అపార్టుమెంట్ వాసుల‌ను స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు.  విద్యుత్ స‌ర‌ఫ‌రాలో లొపాల‌ను స‌రిచేయాల‌ని, రోడ్లు, డ్రైనేజి ప‌నులు పూర్తి చేయాల‌ని అధికారుల‌కు అదేశించారు.. 
 
నగరంలోని పలు పాఠశాలలను  మంత్రి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. హెచ్‌బి కాల‌నీలో ఉన్నత పాఠశాలలో మంత్రి అధికారుల‌తో క‌లిసి త‌నిఖీ చేశారు. విద్యార్థులను విద్యాభోధ‌న‌, జగనన్న గోరు ముద్ద పథకం అమ‌లు తీరు  అడిగి  తెలుసుకున్నారు. అంతకు ముందు పాఠశాల దస్త్రాలను పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలిచ్చారు. మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు. రుచికరమైన భోజనం అందించాలని పేర్కొన్నారు. కరోనా వైరస్‌, చేతుల శుభ్రత తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments