Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగనన్న పాలనలో పన్నుల బాదుడే బాదుడు

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (13:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నుల భారం తడిసి మోపెడవుతోంది. రెవెన్యూ లోటుకు తోడు.. కరోనా కష్టాలు వచ్చి చేరడంతో ఏపీ ఖజానా నిండుకుంది. దీంతో ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాల్సిందిగా అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. దీంతో అధికారులు రెచ్చిపోయారు. ఫలితంగా పన్నుల భారం మోపి కోట్ల రూపాయలను పిండుకుంటున్నారు. 
 
గత ఐదు నెలల కరోనా కాలంలో ఏపీ 15000 కోట్ల మేరకు ఆదాయాన్ని కోల్పోయింది. దీన్ని భర్తీ చేసుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. ఇందులోభాగంగా, కేంద్రం అనుమతితో రూ.31 వేల కోట్లు రుణంగా స్వీకరించనుంది. మరో రూ.15 వేల కోట్ల మేరకు పన్నుల రూపంలో వసూలు చేసింది. 
 
అంతేకాకుండా మరో 3000 కోట్ల రూపాయలను రాబట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అలాగే, మద్యం ధరలను 75 శాతం మేరకు పెంచడం వల్ల రూ.13500 కోట్ల మేరకు ఆదాయాన్ని రాబట్టుకుంది. ఆ తర్వాత జూన్ నెలలో పెట్రోల్, డీజల్‌పై సుంకాన్ని పెంచడం వల్ల మరో రూ.600 కోట్ల మేరకు ఆదాయాన్ని రాబట్టుకుంది. 
 
అలాగే, రాష్ట్రంలో భూముల ధరలు పెంచడం వల్ల అదనంగా రూ.800 కోట్ల ఆదాయం సమకూరింది. ఇదికాకుండా, ప్రొఫెనల్ ట్యాక్స్‌ను పెంచడం వల్ల రూ.161 కోట్లు, 10 శాతం వ్యాట్ పెంచడం వల్ల మరో రూ.300 కోట్ల మేరకు ఆదాయాన్ని సమకూర్చుకుంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments