Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవిందా.. గోవిందా..తిరుమల కొండకు రంధ్రం...! అనుమతి కోసం ఎదురు చూపు..!! ఎందుకు..?

Webdunia
గురువారం, 9 జులై 2015 (21:19 IST)
తిరుమల కొండకు రంధ్రం వేస్తారట... ఒకటి కాదు రెండు కాదు 33 కి.మీ. పొడవున పెద్ద ఎత్తున సొరంగాన్ని తవ్వేస్తారట. ఇందుకోసం ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు పంపారు. కొండను తవ్వేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. తిరుమల కొండను తవ్వాల్సిన అవసరం ఎందుకొచ్చింది.? ప్రమాదమేమి లేదా..? వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. 
 
గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు రాయలసీమవాసులకు వరప్రదాయని. ఈ ప్రాజెక్టు పూర్తికోసం వేలాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. ఎంతో కాలంగా ఆ ప్రాజెక్టు వెనక్కిపోతోందే తప్ప ముందుకు రావడం లేదు. అయితే ఈమధ్య కాలంలో ఆ ప్రాజెక్టును త్వరితిగతిన పూర్తిచేయాలని రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా అధికారులు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఫేజ్-2 కార్యక్రమానికి ప్రతిపాదనలు చేశారు. 
 
తిరుమల కొండల్లో నెలకొని ఉన్న వేంకటేశ్వరా అభయారణ్యాలలోని కొంత భాగంలో పెద్ద సొరంగం తవ్వాలని ప్రతిపాదించారు. ఈ సొరంగం కనీసం 33 కి.మీ. మేర తవ్వాల్సి ఉంటుందట. సాధారణంగా అయితే  నీటిని తీసుకెళ్లడానికి అడవులలో చాలా భాగం కాలువ తవ్వాల్సి ఉంటుంది. దీని వలన అటవీశాఖ అనుమతులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. పైగా అభయారణ్యంలో అనుమతులంటే మాటలు కాదు. దీంతో అధికారులు ప్రాజెక్టులోని 240 కి.మీ నుంచి 296 కి.మీ వరకూ రెండు సొరంగాలను తవ్వడం ద్వారా చాలా మటుకు అనుమతులను పొందాల్సిన అవసరం లేకుండానే ప్రాజెక్టు పూర్తి చేయవచ్చుననే అభిప్రాయానికి వచ్చారు. 
 
దీనినే అధికారులు రాష్ట్రప్రభుత్వానికి ప్రతిపాదించారు. అయితే ఇందుకోసం అదనంగా రూ. వెయ్యికోట్ల వరకూ నిధులు ఖర్చయ్యే అవకాశం ఉంది. దాదాపుగా కడప, చిత్తూరు జిల్లాలలో 2.66 లక్షల ఎకరాలకు సాగునీరు, 5 లక్షల మందికి సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు ద్వారా తిరుమల, తిరుపతిలకు సాగునీరు పుష్కలంగా అందే అవకాశం ఉంది. అయితే సొరంగం ఎక్కడ తవ్వుతారనే విషయంలో మాత్రం వివాదం అయ్యే అవకాశాలే ఉన్నాయి. 
 
అలిపిరి నుంచి జూపార్కులోపు ఈ సొరంగాన్ని తవ్వుతారు. రెండు చోట్ల సొరంగం తవ్వాల్సి ఉంటుంది. అయితే ఇది తిరుమలకు ప్రధానమైన ప్రాంతం కావడం ఇక్కడ అనేక అరుదైన జంతు జాలం ఉంది. ఈ కాలువ తిరుపతిని తాకుతున్నందున ఈ రెండు సొరంగాలకు బాలాజీ-1 బాలాజీ-2 అనే పేర్లు కూడా ప్రతిపాదించారు. అంటే తిరుమల కొండకు రంధ్రం వేసి చంద్రగిరి మీదుగా, పుత్తూరు, నగరి వరకూ సాగునీటిని తీసుకెళ్ళతారు. అయితే నమ్మకాలతో కూడుకున్న తిరుమల కొండకు సొరంగం వేయడం అనేది వెలుగులోకి వస్తే జనం స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు లాంచ్ చేసిన నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్‌ నుంచి లవ్లీ సాంగ్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమా బెటర్ కోసం పోస్ట్ పోన్ అయ్యింది

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

Show comments