Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెమీ ఫైనల్స్‌ను ప్రారంభించిన హాకీ ఆంధ్రప్రదేశ్ సభ్యుడు రాజశేఖర్

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (23:54 IST)
క్రీడా స్పూర్తితో ముందడుగు వేస్తే విజయం తధ్యమని హాకీ ఆంధ్రప్రదేశ్ సభ్యుడు, రాజ్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పిఎస్ రాజశేఖర్ అన్నారు. ఏలూరు సిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కేంద్రంగా జరుగుతున్న 13వ ఆంధ్రప్రదేశ్ సీనియర్ మహిళల అంతర్ జిల్లా హాకీ ఛాంపియన్షిప్ పోటీలకు గురువారం ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
 
కాకినాడ, అనంతపురం జిల్లా జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుండగా, ఆ బృందాలను పరిచయం చేసుకుని పోటీని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ హకీ క్రీడకు పూర్వవైభవం తీసుకురావాలసిన బాధ్యత నేటి యువతపై ఉందని సూచించారు. శుక్రవారంతో పోటీలు ముగియనుండగా ఫైనల్స్‌కు కాకినాడ, విశాఖపట్నం జట్లు చేరుకున్నాయి.
 
గత మూడు రోజులుగా విభిన్న జిల్లాల నుండి వచ్చిన 14 జట్లు ఛాంపియన్ షిప్ కోసం పోటీ పడ్డాయి. కార్యక్రమంలో అసోసియేషన్ ఏలూరు జిల్లా కార్యదర్శి సతీష్, పరిశీలకుడు రవిరాజా, రాష్ట్ర స్దాయి క్రీడాకారులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments