Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యభిచార అడ్డాగా గుంటూరు... రాజధాని ప్రాంతాలకూ విస్తరణ...

నవ్యాంధ్ర రాజధాని అమరాతికి కూతవేటు దూరంలో ఉన్న జిల్లా కేంద్రం గుంటూరు ఇపుడు వ్యభిచారానికి అడ్డాగా మారిపోయింది. ఇక్కడ ఉన్న వ్యభిచార గృహాల నిర్వాహకులు, రౌడీషీటర్లు, బ్రోకర్లు... తమ ఇష్టారాజ్యంగా వ్యవహరి

Webdunia
మంగళవారం, 25 జులై 2017 (10:32 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరాతికి కూతవేటు దూరంలో ఉన్న జిల్లా కేంద్రం గుంటూరు ఇపుడు వ్యభిచారానికి అడ్డాగా మారిపోయింది. ఇక్కడ ఉన్న వ్యభిచార గృహాల నిర్వాహకులు, రౌడీషీటర్లు, బ్రోకర్లు... తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, వ్యభిచార గృహాలను పగలురాత్రి అనే తేడా లేకుండా నిర్వహిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. పనిలోపనిగా తమవైపు కన్నెత్తి చూడకుండా ఉండేందుకు పోలీసులకు కూడా అమ్మాయిలతో పాటు డబ్బు సరఫరా చేస్తూ తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. 
 
నిజానికి గుంటూరు నగరంలో ఒకప్పుడు కొత్తపేటకు పరిమితమైన వ్యభిచారం అరండల్‌పేట, పట్టాభిపురంలోని నివాస ప్రాంతాలు, ఇన్నర్‌‌ రింగ్‌ రోడ్డు అపార్టుమెంట్స్, నగర శివారులు, మంగళగిరి పరిసర ప్రాంతాలకు విస్తరించింది. వ్యభిచార గృహాలకు చుట్టుపక్కన ఉన్నవారు 100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసినా అప్పటికప్పుడు తూతూ మంత్రంగా రైడింగ్‌లు చేస్తున్నారే గానీ... కఠిన చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. 
 
ఇటీవల గుంటూరు కొత్తపేటలోని శెనక్కాయల ఫ్యాక్టరీ సమీపంలోని ఓ భవనంలో వ్యభిచారం నడుస్తోందని పోలీసులకు సమాచారం ఇస్తే.. వారు అక్కడికి వచ్చి ఫిర్యాదు ఇచ్చిన వారికి, నిర్వాహకులకు మధ్య రాజీ కుదిర్చి వెళ్లిపోయారు. దీనిపై అపుడే తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. వ్యభిచార గృహం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు రాజీ కుదర్చడమేంటని పలువురు ప్రశ్నించారు. 
 
నిజానికి గతంలో ఎస్పీగా సీతారామాంజనేయులు, ఏఏస్పీగా భావనా సక్సేనా ఉన్నప్పుడు వారు ప్రత్యే బృందాలు ఏర్పాటు చేసి మరీ దాడులు చేయించారు. సమస్యల మూలాల దాకా వెళ్లి విచారణ చేపట్టేవారు. పట్టుబడిన అమ్మాయిలు, విటులు, నిర్వాహకులపైనా కఠిన చర్యలూ తీసుకునేవారు. ఆ తర్వాత వచ్చిన వారు పట్టించుకోకపోవడంతో సెక్స్‌ రాకెట్ తన పరిధుల్ని విస్తరించుకుంటోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం