Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీరాలలో హైటెక్ వ్యభిచారం: మహిళలు బ్రోకర్ల ఉచ్చులో చిక్కుకుని..?

Webdunia
ఆదివారం, 19 అక్టోబరు 2014 (08:20 IST)
చీరాలలో హైటెక్ వ్యభిచారం జరుగుతోంది. కొందరు యువతులు, మహిళలు బ్రోకర్ల ఉచ్చులో చిక్కుకుని పచ్చని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. చీరాల కేంద్రంగా జరుగుతున్న హైటెక్ వ్యభిచారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. మెట్రో నగరాల్లో సాగే ఈ హైటెక్ వ్యభిచారం చివరకు చీరాలకు కూడా పాకింది. కొందరు బ్రోకర్లు స్థానికంగా మకాంలు ఏర్పాటు చేసుకుని ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలు, మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు.
 
కొత్తపేట పంచాయతీలోని కొన్ని ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ వ్యభిచారం సాగుతోంది. కాలేజీ విద్యార్థినులతో పాటు మహిళలకు డబ్బు ఆశపెట్టి లోబర్చుకుని వారిని ఈ వృత్తిలోకి దించుతున్నారు. కొత్తపేట పంచాయతీలోని దీనమ్మదిబ్బ, మూడురోడ్ల సెంటర్, పట్టణంలోని ఓ లాడ్జి, రైల్వేస్టేషన్ ఎదురు ఉన్న రెసిడెన్సీతో పాటు తీర ప్రాంతంలో ఉన్న పలు భవనాల్లో వ్యభిచారం యథేచ్ఛగా సాగుతోంది. మహిళలను బేరం పెడుతున్నారు. 
 
బ్రోకర్లు మహిళలకు డబ్బు ఆశ చూపి తమ పబ్బాన్ని గడుపుకుంటున్నారు. చేనేత రంగానికి ప్రసిద్ధి చెందిన చీరాల ప్రాంతం ప్రస్తుతం ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు వేదికైంది. గతంలో కొత్తపేట పంచాయతీలో ఓ లేడీస్ హాస్టల్ నిర్వాహకురాలు తనతో పాటు కాలేజీ అమ్మాయితో స్వలింగ సంపర్కాన్ని నగ్నంగా వీడియో తీయించిన విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో బ్రోకర్లు కూడా తెలివిమీరారు. నివాసాల మధ్య ఇళ్లు అద్దెకు తీసుకుని రాత్రి వేళల్లో ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం సాగిస్తున్నారు. అక్కడ విషయం బయటకు తెలియడంతో మకాం మార్చేసి మరోచోట దుకాణం తెరుస్తున్నారు. మహిళలు కుటుంబ పరిస్థితుల కారణంగా కొందరు, డబ్బు కోసం ఆశపడి మరికొందరు ఈ మురికి కూపంలోకి దిగుతున్నారు.  

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments