Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెజవాడకు పాకిన హిజాబ్ వివాదం - లయోలా కాలేజీలో...

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (15:06 IST)
కర్నాటక రాష్ట్రంలో మొదలైన హిజాబ్ వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలోకి వెళ్లడంతో కాస్తంత సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు చేరుకుంది. స్థానిక లయోలా కాలేజీలో హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థినులను కాలేజీ యాజమాన్యంలోనికి అనుమతించలేదు. 
 
దీనికి ఆ విద్యార్థులు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. తామంతా మొదటి సంవత్సరం నుంచి హిజాబ్ ధరించే తరగతులకు హాజరవుతున్నామని, ఇపుడు కొత్తగా తమను అడ్డుకోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. 
 
ఈ వ్యవహారం బయటకుపొక్కడంతో టీవీల్లో వార్తలు వచ్చాయి. దీంతో ఈ కాలేజీ వద్దకు భారీ సంఖ్యలో ముస్లిం ప్రజలు చేరుకుంటున్నారు. దీంతో కాలేజీ వద్ద పోలీసు బందోబస్తు కల్పించారు. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా బెజవాడ లయోలా కాలేజీలో హిజాబ్‌ ధరించడాన్ని ఎందుకు వివాదం చేస్తున్నారని విద్యార్థినులు ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments