Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాక్స్ ఇష్యూ: టి. ప్రభుత్వానికి హైకోర్టు షాక్..!

Webdunia
బుధవారం, 30 జులై 2014 (17:42 IST)
తెలంగాణ ప్రభుత్వానికి టాక్స్ ఇష్యూపై హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించే వాహనాలపై పన్ను విషయంలో హైకోర్టు టి. సర్కారుకు ఝలక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే సరుకు, ఇతర రవాణా వాహనాలపై పన్ను వసూలు చేయకూడదని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
 
వచ్చే ఏడాది మార్చి వరకు ఇరు రాష్ట్రాల మధ్య తిరిగే వాహనాలపై పన్ను వసూలు చేయకూడదని సూచించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో పన్ను చెల్లిస్తే ఇరు రాష్ట్రాల్లో తిరగడానికి వాహనాలకు అనుమతి ఇస్తూ గవర్నర్ జూన్ 1వ తేదీన 43వ నెంబర్ జీవో జారీ చేశారు. ఆ జీవోను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం 586 నెంబర్ సర్క్యులర్‌ను జారీ చేసింది. 
 
ఈ సర్క్యులర్‌ను జారీ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం పన్ను వసూలును ప్రారంభించింది. దీన్ని సవాల్ చేస్తూ తిరుమల క్యాబ్స్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది. 
 
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఇరు రాష్ట్రాల మధ్య వాహనాలు తిరగడానికి ఒక్క రాష్ట్రంలో పన్ను చెల్లిస్తే చాలునని గవర్నర్ జారీ చేసిన జీవోను సమర్థించింది. రవాణా పన్ను విషయంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు జీవో నెబంర్ 43కు కట్టుబడి ఉండాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments