Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యా.. నువ్వు ఆంధ్రా పోలీసువా, నీ ఐడీకార్డ్ ఏదీ? బ్యాడ్జ్ ఎక్కడ?

ఐవీఆర్
గురువారం, 23 మే 2024 (13:40 IST)
ఎన్నికల సమయంలో విచ్చలవిడిగా అక్రమాలు చేసేందుకు రకరకాల ప్రణాళికలతో చాలామంది పోలింగ్ బూత్ ల వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం రామస్వామిపల్లి బూత్ నెంబర్లు 111, 112 వద్దకు పోలీసు దుస్తులతో కొందరు ప్రవేశించారు. ఐతే వారి వాలకాన్ని చూసి అనుమానించిన అక్కడివారు ప్రశ్నించడం ప్రారంభించారు. మీ ఐడి కార్డ్ ఎక్కడ, మీ బ్యాడ్జీలు ఏవీ అని అడుగుతుండటంతో వాహనంలో పోలీసు దుస్తుల్లో కూర్చుని వున్న ఓ వ్యక్తి నీళ్లు నములుతున్నాడు. కానీ అతడు నిజమైన పోలీసా? నకిలీ పోలీసా అన్నది తెలియరాలేదు. చూడండి ఆ వీడియోను...
 
మాచర్ల జిల్లా పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న అధికార వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాష్ట్రం విడిచి పారిపోయాడు. పైగా, ఆయన విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అందుకే పోలీసులు ఆయనకు వ్యతిరేకంగా లుకౌట్ నోటీసు జారీ చేసి అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. 
 
ఈ ఈవీఎం విధ్వంసం కేసులో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమై లుకౌట్ నోటీసులు జారీచేశారు. విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అందులో పేర్కొంటూ అన్ని విమనాశ్రయాలను పోలీసులు అప్రమత్తం చేశారు. పైగా, పిన్నెల్లిపై ఐపీసీ 143, 147, 448, 427, 353, 453, 120 బీ, ఆర్పీ యాక్ట్ 131, 135 సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. ఈ కేసులో ఆయనపై ఇప్పటికే ఏ1గా కోర్టులో మెమో దాఖలు చేశారు. 
 
ఈ పరిస్థితుల్లో పిన్నెల్లి అరెస్టు కోసం రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో ఉన్నట్టు సమాచారం రావడంతో తెలంగాణా పోలీసులతో కలిసి గాలిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కందిరిలో పిన్నెల్లి కారును గుర్తించారు. అయితే, కారులో ఆయన కనిపించలేదు. కానీ పిన్నెల్లి కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తొలుత పిన్నెల్లి అరెస్టు అంటూ వార్తలు వచ్చినప్పటికీ ఆ తర్వాత ఆయన డ్రైవర్‌ను అరెస్టు చేసినట్టు పోలీసులు ప్రకటించారు. ఆ తర్వాత పిన్నెల్లి కోసం ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

భారతదేశంలో వైభవోపేతంగా అడుగుపెట్టిన హెచ్ అండ్ ఎం బ్యూటీ కాన్సెప్ట్

తర్వాతి కథనం
Show comments