ప్రేక్ష‌కుల‌ను అవ‌మానించారు... నేచుర‌ల్ స్టార్ నాకొద్దు!

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (14:26 IST)
ఏపీలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం నిర్ణ‌యాల‌పై నేచుర‌ల్ స్టార్ హీరో నాని నిర‌స‌న తెలిపారు. సినిమా టిక్కెట్ల‌పై సినీ నటుడు నాని మీడియా సమావేశం నిర్వ‌హించారు. ఏపీ ప్రభుత్వం టికెట్ ధర తగ్గించి ప్రేక్షకులను అవమానించింద‌ని హీరో నాని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కొత్త సినిమా రిలీజ్ అయితే, ఆ  థియేటర్ల కంటే, పక్కనున్న కిరాణా కొట్టు కలెక్షన్ ఎక్కువైంద‌ని ఎద్దేవా చేశారు. 

 
సినిమా టికెట్ ధర పెంచినా, కొనే సామర్థ్యం తెలుగు ప్రేక్షకులకు ఉంది. అయినా తాను ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదం అవుతుంద‌ని హీరో నాని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నా పేరు ముందు నేచురల్ స్టార్ తీసెద్దాం అనుకుంటున్నా అని హీరో నాని పేర్కొన్నారు.

 
అయితే, సినీ వ‌ర్గాల విమ‌ర్శ‌ల‌ను మంత్రి బొత్స స‌త్య‌న్నారాయ‌ణ ఖండించారు. సినిమా టికెట్ల ధరలను నియంత్రిస్తే అవమానించడమా? మేమింతే, ఎంత అంటే అంత వసూలు చేస్తామంటే కుదరదు.. సినిమా సామాన్యులకు అందుబాటులో ఉండాలి, అందుకే ధరలు తగ్గించాం అని మంత్రి బొత్స స‌మాధానం ఇచ్చారు. 

 
తూర్పు గోదావరి జిల్లాలో పలుచోట్ల సినిమా థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేశారు. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే టికెట్ల అమ్మకాలు కొనసాగించాలన్న అధికారుల ఆదేశాలతో థియేటర్లను యాజమాన్యాలు మూసివేశాయి. జిల్లాలోని 50కి పైగా థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments