Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో 31న మందు కొట్టి డ్రైవ్ చేస్తే అంతే.. తస్మాత్ జాగ్రత్త..

డిసెంబర్ 31. సంవత్సరం పూర్తయ్యే రోజు. అర్థరాత్రి పూట మందుకొట్టి డ్రైవ్ చేస్తారు. బీచ్‌ల వద్ద పండగ చేసుకుంటారు. స్నేహితులతో కలసి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు. కొత్త సంవత్సర వేడుకల్లో భారీ స్థాయ

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2016 (17:16 IST)
డిసెంబర్ 31. సంవత్సరం పూర్తయ్యే రోజు. అర్థరాత్రి పూట మందుకొట్టి డ్రైవ్ చేస్తారు. బీచ్‌ల వద్ద పండగ చేసుకుంటారు. స్నేహితులతో కలసి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు. కొత్త సంవత్సర వేడుకల్లో భారీ స్థాయిలో పాల్గొనే వారి సంఖ్య మనదేశంలోనూ చాలా ఎక్కువే. అయితే ఇందుకు తెలంగాణ సర్కారు గండి కొట్టింది. ఇయర్ ఎండింగ్ కదాని మందుకొట్టి డ్రైవ్ చేశారో అంతే సంగతులు.
 
ఫ్రెండ్స్‌తో మందుపార్టీల్లో గడిపి అర్థరాత్రో అపరాత్రో ఇంటికి బయలుదేరితే డ్రంక్ అండ్ డ్రైవ్ ఏముంటుందిలే అనుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాజధాని హైదరాబాద్‌లో డిసెంబర్‌ 31న రాత్రి 10 గంటల నుంచి జనవరి 1న ఉదయం ఐదు గంటల వరకు పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించబోతున్నారు. ఇందుకోసం వందకు మించిన పోలీస బృందాలు పహారాకాయబోతున్నాయి.
 
మద్యం తాగి నడిపితే వాహనాన్ని సీజ్‌ చేస్తామని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ రంగనాథ్‌ హెచ్చరించారు. అతివేగంతో పాటు మందు తాగి బండి నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నిరోధించేందుకు పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రంగనాథ్ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments