Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త చనిపోయాడు, 13 ఏళ్ల నుంచి ప్రియుడితోనే, అర్థరాత్రి ఆ పని చేసిపోయాడు

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (20:43 IST)
భర్త అనారోగ్యంతో చనిపోయాడు. అయితే ఇక అక్కడ ఉండలేక తన 13 యేళ్ళ కుమారుడితో కలిసి వేరే ప్రాంతానికి వలస వెళ్ళింది. అక్కడ కూలీ పనిచేసుకుంటూ ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కానీ ఉన్నట్లుండి అతని చేతిలోనే దారుణ హత్యకు గురైంది.
 
నందనవనం సమీపంలోని ఇంద్రసేనారెడ్డి నగర్ బస్తీ ప్రాంతమది. ఉన్నట్లుండి అరుపులు, కేకలు. తన తల్లి చనిపోయిందంటూ కొడుకు బయటకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.
 
రంగంలోకి దిగారు పోలీసులు. మహిళది దేవరకొండ ప్రాంతంగా గుర్తించారు. తన భర్త అనారోగ్యంతో చనిపోతే 13 సంవత్సరాల క్రితం ఇంద్రసేనారెడ్డి నగర్ బస్తీకి వచ్చినట్లు గుర్తించారు. ఇక్కడకు వచ్చిన వెంటనే శ్రీకాంత్ అనే వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందట.
 
ఈ విషయం స్థానికులందరికీ తెలుసు. అయితే శ్రీకాంత్ మద్యానికి బానిస. బాగా ఫుల్లుగా తాగి రోజూ ఇంటికి రాత్రిపూట వెళ్ళేవాడు. అర్థరాత్రి సమయంలో ఇద్దరి మధ్యా గొడవ జరిగి ఆమెను గొంతు నులిమి చంపేశాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
 
తల్లి ఎంతకూ లేవకపోవడంతో కొడుక్కి అనుమానం వచ్చి స్థానికులకు చెప్పాడు. హత్యగా భావించి వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రియుడు శ్రీకాంత్‌ను విచారిస్తే తనకేమీ సంబంధం లేదంటున్నాడు. రాత్రి సమయంలో శ్రీకాంత్ తప్ప వేరే వ్యక్తి లేకపోవడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments