యూకేలో చిక్కుకుపోయిన విద్యార్థులకు సహాయం చేయండి: పవన్ కళ్యాణ్

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (21:35 IST)
భారతదేశం నుంచి ఉన్నత విద్య కోసం యూకే వెళ్ళిన 300 మంది విద్యార్థులు కరోన విస్తృతితో తీవ్ర భయాందోళనలో ఉన్నారని.. వారిని ఆదుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి శ్రీ ఎస్.జైశంకర్‌కు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం ట్విటర్ ద్వారా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి లేఖ పంపించారు. 
 
అక్కడ చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు తమ సమస్యను జనసేన పార్టీ దృష్టికి తీసుకువచ్చారు. శ్రీ పవన్ కల్యాణ్ గారు స్పందించి కేంద్ర మంత్రికి లేఖ రాశారు. “కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి చెందుతున్న తరుణంలో మీరు చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం. మీ దృష్టికి యూకేలో చిక్కుకున్న వారి బాధలు తీసుకు వస్తున్నాను. 
 
స్వదేశానికి వచ్చేయడానికి ప్రయత్నించిన ఆ విద్యార్థులు యూకే విమానాశ్రయాల్లో, లండన్ లోని హై కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉండిపోవడంతో... వారు స్వదేశానికి వచ్చే మార్గం లేకుండాపోయింద”ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గత 12 రోజులుగా వారికి సరైన ఆహారం, వసతి లేక ఇబ్బందులుపడుతున్నారన్నారు. 
 
వైరస్ వ్యాప్తితో మరింత భయాందోళనలకు లోనవుతున్నారని, మన విదేశీ మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించి తగిన ఆహార, వసతి సదుపాయాలు కల్పించాలని కోరారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ వి.మురళీధరన్ దృష్టికీ ఈ సమస్యను తీసుకువెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" : 'కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్' అంటున్న నేహాశెట్టి

Bigg Boss Telugu 9: జయం సుమన్ శెట్టికి పెరుగుతున్న మద్దతు..

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments