Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల పంట పండింది... 4 రోజులు వానలే వానలే

Webdunia
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (10:51 IST)
తెలుగు రాష్ట్రాల పంట పండింది. వచ్చే నాలుగు రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 19వ తేదీ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే, ఈ సంవత్సరం ఇప్పటివరకు మూడు శాతం తక్కువగా వర్షాలు కురిశాయన్నారు. 
 
ఇక కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు, ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాల్లో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని, మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ భారీ వర్గాలకు అవకాశముందని అధికారులు తెలిపారు. 
 
ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కాగా, నిన్న రాత్రి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments