Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరవళ్లు తొక్కుతున్న పెన్నానది.. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

Webdunia
ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (17:13 IST)
నెల్లూరు జిల్లాలోని పెన్నానది వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగనున్నాయి. ఎగువున ఉన్న సోమశిల రిజర్వార్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఈ డ్యాం నుంచి నీటికి కిందికి విడుదల చేస్తుండటంతో పెన్నానది ఉగ్రరూపందాల్చి ప్రవహిస్తోంది. 
 
ఫలితంగా పెన్నా పరివాహక ప్రాంతాలు ముంపునకు గురికాగా, లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సోమశిల జలాశయం నుంచి పెన్నాకు విడుదల అవుతున్న నీరు ఆదివారం సాయంత్రానికి మరింత పెరిగే అవకాశం ఉంది. సోమశిల జలాశయానికి ఇప్పటికే 1.42 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంది. దీంతో జలాశయం లోని 12 గేట్లను ఎత్తి 1.56 లక్షల క్యూసెక్కుల నీటిని పెన్నాకు విడుదల చేస్తున్నారు. 
 
ఆదివారం సాయంత్రానికి మరో 50 వేల క్యూసెక్కులను కలిపి 2 లక్షల క్యూసెక్కుల నీటిని పెన్నాకు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. ఇప్పటికే జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ ముంపు ప్రాంతాలను పరిశీలించారు. 
 
జిల్లా మంత్రి గౌతమ్ రెడ్డి సైతం అధికారులతో సమీక్ష నిర్వహించి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి ముంపు వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పెన్నానది ఈ తరహాలో ప్రవహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments