Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్టుకున్న భార్యను హెడ్‌కానిస్టేబులే మోసం చేశాడు.. రెండో భార్యతో సంసారం..

కట్టుకున్న భార్యను ఓ హెడ్ కానిస్టేబుల్ మోసం చేశాడు. భర్త రెండో పెళ్లి చేసుకుని చేసుకున్నాడని పదేళ్ల తర్వాత తెలిసి బాధితురాలు షాకైంది. మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీసే ఇలా చేశాడని.. ఆశ్చర్యపోయింది.

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (11:35 IST)
కట్టుకున్న భార్యను ఓ హెడ్ కానిస్టేబుల్ మోసం చేశాడు. భర్త రెండో పెళ్లి చేసుకుని చేసుకున్నాడని పదేళ్ల తర్వాత తెలిసి బాధితురాలు షాకైంది. మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీసే ఇలా చేశాడని.. ఆశ్చర్యపోయింది.


వివరాల్లోకి వెళితే.. రమావత్ తాలూకారావు అనే వ్యక్తి ప్రస్తుతం గుంటూరు జిల్లా రెంటచింతలలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రమావత్‌కు 2004 ఫిబ్రవరిలో తొలి భార్యతో వివాహం జరిగింది. వీరికి ఆరో తరగతి చదువుతున్న ఇద్దరు కుమార్తెలున్నారు. 
 
ఇంతలో మాచర్లలో పనిచేస్తుండగా.. ఓ కేసు విషయమై పోలీస్ స్టేషన్‌కు వచ్చిన యువతిని రమావత్ పరిచయం ఏర్పరుచుకున్నాడు. ఆమె మాచర్లలోని రోడ్డు పక్కన బండిపై రోటీలు అమ్మకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆమెను తాలూకారావు పెళ్లి చేసుకుని, మొదటి భార్యకు అనుమానం రాకుండా సంసారం సాగించాడు. ఆమెతో ఓ కుమార్తె, గత నెలలో ఓ కుమారుడు జన్మించాడు. కానీ డ్యూటీ పేరుతో ఆయన సరిగ్గా ఇంటికి రావకపోవడంతో తొలి భార్యకు అనుమానం వచ్చింది. ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. 
 
దీనిపై భర్తను నిలదీయగా... తనకు మగ పిల్లలు కావాలని, అందుకే మరో యువతిని పెళ్లి చేసుకున్నానని బదులివ్వడంతో పాటు ఇద్దరితో కాపురం చేస్తానన్నాడు. అయితే భర్త చేసిన మోసాన్ని జీర్ణించుకోలేకపోయిన బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments