Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణను కేంద్రం చిన్నచూపు చూస్తోంది: హరీష్ రావు

Webdunia
బుధవారం, 30 జులై 2014 (11:43 IST)
తెలంగాణను కేంద్రం చిన్నచూపు చూస్తోందని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణకు కేంద్రం ఏం ఇస్తుందో చెప్పాలని హరీష్ రావు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బడ్జెట్‌లో కేంద్రం తెలంగాణ మొండిచేయి చూపితే కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని హరీష్ రావు అడిగారు. 
 
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెసు, బిజెపి చేసిన విమర్శలపై హరీష్ రావు ధ్వజమెత్తారు. తెలంగాణలో కాంగ్రెసు నేతలు ఉనికి కోసమే ప్రభుత్వంపై విమర్సలు చేస్తున్నారని ఆయన అన్నారు. కాంట్రాక్టు కార్మికుల విషయంలో కాంగ్రెసు తన వైఖరి స్ఫష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  
 
రైతులందరికీ రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని హరీష్ రావు తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని ఆయన అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు.  
 
తెలంగాణలో కరెంట్ కోతలకు గత ప్రభుత్వమే కారణమని, కరెంట్ కోత లేకుండా చూసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామన్నారు. హైదరాబాదులో గుండాగిరి, భూకబ్జాలు ఉండకుండా చూడాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని, తెలంగాణ పునర్నిర్మాణం తమ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వల్లనే సాధ్యమవుతుందని తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments