Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాటిపై దాడిని ఖండించిన హరీష్ రావు: ఫో‌న్‌లో పలకరింపు!

Webdunia
శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (13:49 IST)
ఖమ్మం జిల్లా శాసన సభ్యుడు తాటి వెంకటేశ్వర రావు పైన దాడిని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఖండించారు. తాటిపై దాడికి పాల్పడిన వారిపై ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే తాటికి హరీష్ రావు ఫోన్ చేసి పలకరించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
 
మరోవైపు, తాటి వెంకటేశ్వర్లు పైన మాగంటి అనుచరుల దాడిని నిరసిస్తూ ఖమ్మంలోని మయూరి సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
 
గురువారం పోలవరం ముంపు మండలం అయిన ఖమ్మం జిల్లా కుక్కునూరు మండలంలో గురువారం ఆంధ్రా అధికారులు పర్యటించడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ నేతృత్వంలో ఆ జిల్లా ఉన్నతాధికారులు, ఏలూరు ఎంపీ మాగంటి బాబు, పోలవరం ఎమ్మెల్యే శ్రీనివాస రావు కుక్కునూరులో సమీక్ష సమావేశం నిర్వహించారు.
 
ఈ సమయంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు జై తెలంగాణ అంటూ సమావేశ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న ఏలూరు ఎంపి మాగంటి బాబు అనుచరులు వారిని అడ్డుకున్నారు. జై తెలంగాణ నినాదాలకు వ్యతిరేకంగా జై ఆంధ్రా అంటూ వారు కూడా బిగ్గరగా నినదించారు. ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లును, కార్యకర్తలను నెట్టుకుంటూ ముందుకు వచ్చారు.
 
మాగంటి బాబు అనుచరులు ఒక్కసారిగా ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై పిడిగుద్దులు కురిపించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హుటాహుటిన కుక్కునూరు వచ్చారు. ఎమ్మెల్యే తాటితో కలిసి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments