Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ్యాపీడేస్ సీన్ రిపీట్.. ప్రేయసి మోసం... వేరే వ్యక్తితో మజా... ప్రేమికుడు ఏడ్చాడు.. కానీ..?

హ్యాపీడేస్ సీన్ రిపీట్ అయ్యింది. ఆ చిత్రంలో ఓ యువకుడు యువతిని ప్రేమిస్తాడు. ఆమె బర్త్ డే కోసం గిఫ్ట్ తీసుకెళ్తాడు. కానీ అప్పుడు ఆ అమ్మాయి వేరొక వ్యక్తితో ఉల్లాసంగా గడుపుతుంది. ఆ సన్నివేశాన్ని చూసిన సద

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2017 (10:08 IST)
హ్యాపీడేస్ సీన్ రిపీట్ అయ్యింది. ఆ చిత్రంలో ఓ యువకుడు యువతిని ప్రేమిస్తాడు. ఆమె బర్త్ డే కోసం గిఫ్ట్ తీసుకెళ్తాడు. కానీ అప్పుడు ఆ అమ్మాయి వేరొక వ్యక్తితో ఉల్లాసంగా గడుపుతుంది. ఆ సన్నివేశాన్ని చూసిన సదరు ప్రేమికుడు బోరున విలపించి.. స్నేహితుల చెంతకు చేరుకుంటాడు. కానీ ఇలాంటి ఘటనే హాసన్ పర్తిలో చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో యువతీ చేసిన మోసాన్ని తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే, సీసీసీలోని నస్పూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలోని లక్ష్మీనగర్‌ పక్కన ఉండే తెలంగాణ కాలనీకి చెందిన నరేష్‌ (25), గత నాలుగేళ్లుగా శ్రీరాంపూర్‌లోని కృష్ణాకాలనీకి చెందిన ఒక యువతితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఆమె కోసం ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ఎంబీఏ చదివిన ఆ యువతి హైదరాబాద్‌లో పనిచేస్తుండటంతో తాను కూడా అక్కడే ఉద్యోగం వెతుక్కునే పనిలో పడ్డాడు. కానీ ఇద్దరి ప్రేమ బ్రేకప్ అయ్యింది. 
 
నాలుగేళ్లుగా ప్రేమించిన ఆ యువతి.. నరేష్‌ను దూరం పెట్టింది. తాను చనిపోతున్నానని నరేష్ ఆ యువతిని బెదిరించాడు. దీంతో ఆ యువతి బర్త్ డే రోజున కలుద్దామని చెప్పింది. అదీ సాయంత్రం రావాల్సిందిగా చెప్పింది కానీ సాయంత్రం వరకు వేచి చూడకుండానే నరేష్‌ ఉదయమే ఆమె నివసిస్తున్న హాస్టల్‌ దగ్గరకు వెళ్లగా, ఆమె మరో యువకుడితో చనువుగా ఉండటం కనిపించింది. దీంతో ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని సూసైడ్ లెటర్లో రాసిపెట్టి.. తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాడు. ఆపై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments